వైసీపీ ప్రజాస్వామ్య విధానం ఇలాగే ఉంటుంది మరి!

thanks-to-jagan-rapa-rapa-cases-on-gullible-cadre

జగన్‌ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి ప్రభుత్వాలు, పాలనలో ఎలాగూ చాలా తేడా ఉంది. కానీ గతంలో టీడీపీ, జనసేనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రవర్తిస్తున్న తీరులో కూడా చాలా తేడా ఉండటం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎందువల్ల అంటే, అధికారంలో ఉన్నప్పుడు పార్టీల ఆలోచనలు, విధానాలు వేర్వేరుగా ఉంటాయి కనుక వాటి పాలనలో తేడా ఉండటం విచిత్రం కాదు.

ADVERTISEMENT

కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ఒకటే అజెండా ఉంటుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనలో లోపాలు, అవినీతి, అసమర్దతని ఎత్తి చూపిస్తూ పోరాటాలు చేస్తుంటాయి. కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి తీరు ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

కానీ ఈ విషయంలో కూడా వైసీపీ తీరు చాలా భిన్నంగా ఉంటుందని పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలతో జగన్‌ నిరూపించిచూపారు. వైసీపీ శ్రేణులను వెంటబెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళడం తప్పు కాదు.

కానీ తలలు నరకుతాం..అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడం, ప్రజలను భయపెట్టేలా నినాదాలు, ప్రదర్శనలు చేయడం, జగన్‌ స్వయంగా పోలీస్ అధికారులను బట్టలూడదీసి రోడ్లపై నిలబెడతామని బెదిరించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటి పనులను ఎవరూ హర్షించలేరు.

జగన్‌ స్వయంగా ఇటువంటి తప్పులు చేస్తుండటమే కాక, ఇలా వ్యవహరిస్తున్న వైసీపీ శ్రేణులను వెనకేసుకువస్తున్నారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటం అంటే ఇదేనా?అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.

“జగన్‌ ఒక ఎమ్మెల్యే మాత్రమే. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది,” అని హోంమంత్రి అనిత వంగలపూడి అన్నారు.

బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “హోంమంత్రి పనికి రాని చెత్త మాటలు మాట్లాడారు. జగన్‌ మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఆ లెక్కన నేను కేవలం ఎమ్మెల్సీ అంటే కుదరదు. నేను మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌నని ప్రభుత్వం మరిచిపోకూడదు.

మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని మాజీ సిఎంగానే పరిగణించి భద్రత కల్పించాము కదా? ఇప్పుడు మాజీ సిఎం జగన్‌కి కూడా అదే స్థాయిలో భద్రత కల్పించాలి కదా?

మేము అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని చాలా గౌరవించాము. ప్రజాసామ్యానికి కట్టుబడే పనిచేస్తున్నాము. కూటమి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి కదా?” అని అన్నారు.

శాసనసభ స్పీకర్‌, ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని తదితరులు చంద్రబాబు నాయుడుని, రాజకీయాలతో సంబందంలేని ఆయన సతీమణి భువనేశ్వరిని ఏవిదంగా అవహేళన చేశారో బొత్స సత్యనారాయణకి బాగా తెలుసు.

కనుక అధికారంలో లేనప్పుడు కూడా అదేవిదంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం అంటే వైసీపీ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందన్న మాట!

ADVERTISEMENT
Latest Stories