పురందేశ్వరిని విమర్శిస్తుంటే జగన్‌ మౌనమేల?రఘురామ ధర్మసందేహం

Raghu Rama Krishna Raju YCP

వైసీపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో నిన్న తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏపీలో అమలవుతున్న సంక్షేమ పధకాలకు జగన్‌ లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లని తగిలించి సొంత పధకాలుగా ప్రచారం చేసుకొంటోంది.

కేంద్ర ప్రభుత్వం ఇది గమనిస్తూనే ఉంది. అతి త్వరలోనే ఆంధ్రా రాజకీయాలలో ‘జైలర్’ సినిమా తరహా సన్నివేశాలను చూడబోతున్నాము. జైలర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ తన తండ్రినే మోసం చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకొన్న రజినీకాంత్ కన్న కొడుకునే కాల్చిపడేశారు. తమను మోసం చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డిని కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిదంగా బుద్ధి చెప్పబోతోంది,” అని రఘురామ అన్నారు.

ADVERTISEMENT

“జగన్మోహన్‌ రెడ్డి ఎడాపెడా అయినకాడికి అప్పులు చేస్తూ, విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులు తనఖాలు పెట్టి తెస్తున్న డబ్బునే కదా పంచిపెడుతున్నారు? మరి అదేదో తన జేబులో డబ్బు తీసి ప్రజలకు పంచిపెడుతున్నట్లు ప్రజలకు మేలు చేశానంటూ బిల్డప్ దేనికి?” అని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఉద్దేశ్యించి వైసీపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు వారించడం లేదని రఘురామ ప్రశ్నించారు. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న మహిళకే ఇంత అవమానం జరుగుతుంటే, ఆంధ్రాలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైసీపి నేతలు ఆమెను ఇంతగా అవమానిస్తుంటే, అవహేళన చేస్తుంటే ఏపీలోని మహిళా కమీషన్ ఏమైపోయిందని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికలలో తాను టిడిపి, జనసేనలు అభ్యర్ధిగా మళ్ళీ నర్సాపురం నుంచే పోటీ చేస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories