ఒక్క వివాదం: రెండు రాజకీయాలు…?

YSRCP Tirumala Politics

తిరుమల లడ్డు తయారీలో నెయ్యి కల్తీ అన్న ఒక్క అంశాన్ని వైసీపీ రెండు భాగాలుగా విభజించి రెండు రకాల రాజకీయాలు మొదలు పెట్టింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ నెయ్యిలో సిట్ నివేదిక ప్రకారం జంతు కొవ్వు కలవలేదు అంటూ మత రాజకీయాలకు భీజం వేసిన వైసీపీ,

అదే అంశం మీద ముఖ్యమంత్రి ని బూతులు తిడుతూ అరెస్టయిన వైసీపీ నేత అంబటి వ్యవహారాన్ని కుల రాజకీయంగా మలిచేందుకు తన సైన్యాన్ని రంగంలోకి దింపింది. వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదం నెయ్యి లో జంతు కొవ్వు కలవలేదు, ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయం మాత్రమే,

ADVERTISEMENT

బాబు, పవన్ తమ రాజకీయ స్వార్ధం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారు, శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయ ఆట ఆడారు, ఇప్పుడు వారి ఆరోపణలలో వాస్తవం లేదని నిర్ధారణ జరిగే సరికి అందరు ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు,

ఇది కేవలం కూటమి మొదలు పెట్టిన మత రాజకీయమే, దీనికి పవన్ సనాతన ధర్మం అంటూ ముసుగు వేసి ఈ మత రాజకీయాలను ప్రోత్సహించారు, బాబు ప్రకటనలో, పవన్ ఆవేశంలో నిజం లేదు, వీరిద్దరూ వెంటనే యావత్ హిందూ సమాజానికి, ఏడుకొండల వెంకన్న భక్తులకు క్షమాపణలు చెప్పాలి అంటూ వైసీపీ ఏపీలో మత రాజకీయ విద్వేషాలకు భీజం వేసేందుకు సిద్దమయ్యింది.

ఇక మరోపక్క ఈ వివాదంలో అసందర్భ ప్రేలాపనలు పేలి, టీడీపీ శ్రేణులను రెచ్చకొట్టి, వారి ఆవేశానికి కారణమైన దాడులకు కుల రాజకీయాలను జోడించారు. ముఖ్యమంత్రి బాబు కాపు సామాజికవర్గం మీద పగ సాధిస్తున్నారు అంటూ ఒకరు, ఈ రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి రక్షణ లేదంటూ మరొకరు,

కాపులంటే టీడీపీ కి ఇంత చిన్న చూపా అంటూ ఒకరి వాదన, టీడీపీ, కాపు నేతల ఇంటి మీద దాడులు చేయిస్తుందంటూ మరొకరి ఆరోపణ, పవన్ అండ చూసుకుని కాపు సామాజికవర్గం మీద టీడీపీ రెచ్చిపోతుంది అంటూ ఇంకొకరి వాగ్వాదం తో ఆ పార్టీ బూతు రాజకీయానికి జగన్ కుల ముద్ర వేస్తున్నారు.

అందులో భాగంగానే విడుదల రజని నుంచి రాజకీయ అజ్ఞాతంలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వరకు, కాపు కుల పెద్దగా ఉన్న ముద్రగడ నుంచి కోడిగుడ్డు మంత్రిగా పేరు దక్కించుకున్న గుడివాడ వరకు, పేర్ని నాని ఇలా అనేకమంది వైసీపీ కాపు నేతలంతా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు, ఏపీలో కాపులకు రక్షణ లేదంటూ కుల రాజకీయాలను రెచ్చకొడుతున్నారు.

ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు మాదిరి ఒక్క వివాదంతో రెండు రకాల రాజకీయానికి వైసీపీ శ్రీకారం చుట్టూ ఆ రాజకీయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలను తీసుకొస్తుంది. మళ్ళీ అదే అంశం మీద ఢిల్లీ పార్లమెంట్ భవనం ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా పెట్టండి అంటూ నిరసనలు చేస్తూ ఈ విధంగా ఏపీ పరువును ఢిల్లీ వీధులలో నిలబెడుతుంది వైసీపీ.

ADVERTISEMENT
Latest Stories