
తనకు అనుకూలంగా లేకుంటే సొంత తల్లిని, చెల్లిని కూడా ఉపేక్షించని జగన్, తన పదవి వియోగాన్ని, తన పార్టీ ప్రస్తుత స్థితికి కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రశాంతంగా బతకనిస్తారా.? వారి భవిష్యత్ ను అభివృద్ధి బాట పట్టనిస్తారా.?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైసీపీ విపక్షానికి పరిమితమయ్యి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా అధికార పక్షమైన కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధపడితే, విపక్షమైన వైసీపీ పోరుబాటలకు సంసిద్ధమయ్యింది.
Also Read – మిథున్ రెడ్డి: కోటరీ కట్టుబాట్లు పాటిస్తారా.?
అయితే విపక్షంగా వైసీపీ, కూటమి ప్రభుత్వం పై పోరాడడం తప్పుకాదు కానీ వైసీపీ పోరుబాటల పేరుతో ప్రతీకార చర్యలకు దిగుతుందా.? ఏపీ ప్రజల మీద పగ తీర్చుకోబుతుందా.? అన్నట్టుగా హింసా కార్యక్రమాలతో తెగబడుతూ, రెచ్చకొట్టే రాజకీయం చేస్తూ, కవ్వింపు చర్యలకు దిగుతుంది.
దీనితో రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించి తద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు పెట్టకుండా చేయాలనీ వైసీపీ భావిస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఇలా అవసరం లేని రాద్ధాంతాలు సృష్టించి, దాడుల రూపంలో అసాంఘిక చర్యలను ప్రోత్సహిస్తుందా.? అనిపిస్తుంది.
Also Read – కమల్ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!
అందులో భాగంగానే మొన్న పొదిలి ఘటన, నిన్న సత్తెనపల్లి మారణ హోమం ఇంకా కళ్ళ ముందు నుంచి చెరపక ముందే నేడు ‘యువత పోరు’ అంటూ వైసీపీ మరో కొత్త ఎత్తుతో రోడ్డు మీద రాజకీయం మొదలుపెట్టింది. నాడు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఉదరకొట్టిన జగన్, వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వాలంటీర్ జాబ్ లతో కాలక్షేపం చేసారు.
ఐదేళ్ల వైసీపీ కాలపరిమితిలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేకపోయిన జగన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే యువతకు మొండి చెయ్యి చూపిన కూటమి అంటూ పోరుబాట పట్టడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటనతో నిరుద్యోగ యువతకు కొంతమేరకు ఉపశమనం కల్పించింది.
Also Read – మంగళగిరి మొనగాడెవరు.?
అలాగే రాబోయే నాలుగేళ్లలో ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది అంటూ మంత్రి లోకేష్ పూర్తి స్పష్టతతో ప్రకటనలు చేస్తున్నారు, ఆ దిశగానే మార్గాలు సులభం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన స్వలాభం కోసం ఇలా పార్టీలోని యువతను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోరుబాటలు, పోరాట యాత్రలు అంటూ విధ్వంశం సృష్టిస్తున్నారు.
పార్టీ క్యాడర్లో ఉండే యువతే లక్ష్యంగా జగన్ చేస్తున్న రెచ్చకొట్టే రాజకీయం వైసీపీ కి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడే చెప్పలేం కానీ అది రాష్ట్ర భవిష్యత్ కు మాత్రం అంత్యత హానికరం. ఒక పక్క సీఎం బాబు రాజధాని నిర్మాణాలను పూర్తి చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యాలని కలలు కంటుంటే,
వైసీపీ మాత్రం రాజధానిని వేశ్యల నగరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంది. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతం అంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంటే, అసలు ఏపీలో శాంతి భద్రతలే అదుపులో ఉండవు అనేలా వైసీపీ ప్రచారం చేస్తుంది.
ఏపీలో స్థిరమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఉంది అంటూ కూటమి నమ్మబలుకుతుంటే, 2025 లో వచ్చేది మేమే, ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతాం….అంటూ వైసీపీ భయపెడుతుంది. ఇలా కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తుంటే వైసీపీ తన విధ్వంశ రాజకీయంతో అరాచకానికి ప్రోత్సహాన్ని అందిస్తుంది.
వైసీపీ తానూ ఎన్నుకున్న హింసా మార్గం ద్వారా రాష్ట్ర విధ్వంశం అనే తన లక్ష్యాన్ని అందుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారుతోంది, ఏ స్థాయికైనా బరితెగిస్తుంది. అందుకోసం సొంత పార్టీ క్యాడర్ భవిష్యత్ ను పణంగా పెట్టడానికి సైతం జగన్ వెనుకాడడం లేదు.
మొన్న పొదిలి ఘటనతో దాడులకు తెగబడిన వైసీపీ అమానుషానికి అద్దం పడితే, నిన్న సత్తెనపల్లి ఘటనతో మానవత్వానికి సమాధి కట్టింది. ఇక నేడు యువత పోరు అంటూ పిలుపునిచ్చిన వైస్ జగన్ ఇంకెతమంది సొంత పార్టీ యువతను జైళ్లకు పంపనున్నారో.? ఇంకెంతమందికి కేసులను రిటర్న్ గిఫ్ట్ గా అందించనున్నారో.? చూడాలి.