కాలకేయ సైన్యం విరుచుకుపడుతుంటే… నిద్రపోతున్నారా?

YSRCP social media controversy with flexi banners and High Court criticism on police in Andhra Pradesh

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజల ఆలోచన సరళి మారింది. మళ్ళీ దానిలోకి రాజకీయ పార్టీలు, వాటి వారియర్స్ ప్రవేశించిన తర్వాత వాటి యుద్ధాలకు సోషల్ మీడియా వేదికగా మారింది. ఆ యుద్ధాలు రాన్రాను నికృష్టస్థాయికి దిగజారిపోతున్నాయి.

కానీ ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. సంస్కారం అడ్డొచ్చి ఎవరైనా వెనక్కు తగ్గితే ప్రత్యర్ధులు మరింత రెచ్చిపోయి పార్టీలకు చేసే నష్టం అంతా ఇంతా కాదు. కనుక అయిష్టంగానైనా సోషల్ మీడియా బురదలో దిగి అంటించుకోక తప్పడం లేదు.

ADVERTISEMENT

రాజకీయాలలోకి వైసీపీ ప్రవేశించిన తర్వాత అది కొత్తగా ఫ్లెక్సీ బ్యానర్ రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టింది. “మేమొస్తే తలకాయలు నరికేస్తాం,’ అంటూ జగన్‌ ఫొటోలతో బ్యానర్లు పెట్టి వాటి ముందు గొర్రెలు, మేకలు, కోళ్ళు బలిచ్చి రక్తాభిషేకాలు చేస్తున్నారు! వైసీపీ చేస్తున్న ఈ ఫ్లెక్సీ బ్యానర్ రాజకీయాలు చూసి సామాన్య ప్రజలు భయపడుతున్నారు.

పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టినట్లు మీడియాలో వచ్చే వార్తలతో సరి. ఆ తర్వాత ఆ కేసులో నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారా లేక రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి కేసులను అటకెక్కించేస్తున్నారా? తెలీని పరిస్థితి. పోలీసుల నిర్లిప్తతని హైకోర్టు కూడా తప్పు పట్టిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

“సాక్షాత్ ముఖ్యమంత్రినే అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, బహిరంగంగా బూతులు తిడుతుంటే, ప్రభుత్వానికి సవాలు విసురుతూ బహిరంగంగా ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుంటే, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పనిచేస్తున్నారా లేక నిద్రపోతున్నారా?” అంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సూటిగా ప్రశ్నించారు.

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ ఛార్జ్ షీట్‌ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ చేసిన లుకవుట్ నోటీస్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌పై నిన్న హైకోర్టు విచారణ జరిగినప్పుడు జస్టిస్ బట్టు దేవానంద్ ఈ వ్యాఖ్యలు, విమర్శలు చేశారు.

మొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “నేను పాదయాత్ర మొదలుపెడితే ఇక రోజూ సిఎం చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తాను,” అంటూ హెచ్చరించారు. జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించింది ఇలాంటి వైఖరినే!

సిఎం చంద్రబాబు నాయుడు నిన్న ఓ సభలో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రినైన నన్నే లేపెస్తానని బహిరంగంగా బెదిరిస్తున్నారు. పార్టీ పేరుతో ఓ 50 మంది వెంటేసుకొని రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్నారు. నేను తలుచుకుంటే వారిని ఒక్క నిమిషంలో లోపల వేయించగలను. కానీ చట్టం తన పని తాను చేసుకుపోవాలని కోరుకుంటున్నాను. అందుకే నేను జోక్యం చేసుకోవడం లేదు,” అని అన్నారు.

అంటే కాలకేయ సైన్యాన్ని కట్టడి చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీసులదే అని సిఎం చెప్పారన్న మాట! కానీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు సహకరిస్తున్నా పోలీసులు సమర్ధంగా వ్యవహరించడం లేదనే భావన జస్టిస్ బట్టు దేవానంద్ మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది.

కనుక సోషల్ మీడియాలో, ఫ్లెక్సీ బ్యానర్లతో రెచ్చిపోతున్న కాలకేయులపై పోలీసులు కటిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories