YSRCP Targets Chandrababu Naidu After Kuppam Incident

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా చిన్నా పెద్దా నేరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని పోలీసులు నియంత్రిస్తూనే ఉంటారు. ఇదివరకు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. ఇప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో అవాంఛనీయ ఘటనలను అదుపు చేయవచ్చు కానీ పూర్తిగా అడ్డుకోలేమని అందరికీ తెలుసు.

ఇటువంటిదే సిఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప అనే వ్యక్తి వద్ద రూ.80 వేలు అప్పు తీసుకొని తీర్చలేక పారిపోయాడు.

Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

అప్పటికే అతని భార్య శిరీష బెంగళూరులో కూలిపనులు చేస్తూ కొడుకుని చదివించుకుంటున్నారు. సోమవారం ఆమె కొడుకు టీసీ కోసం నారాయణపురం వచ్చినప్పుడు, తమ అప్పు తీర్చకుండా మొగుడు పెళ్ళాలు ఇద్దరూ పారిపోయారంటూ ముని కన్నప్ప కుటుంబ సభ్యులు ఆమెని నిర్బంధించారు. తప్పకుండా అప్పు తీరచేస్తానని ఆమె ఎంతగా వేడుకొన్నప్పటికీ వినకుండా ఓ చెట్టుకు కట్టేశారు.

ఈ ఫోటోలు, వీడియో మొదట సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ మహిళని విడిపించి, ముని కన్నప్పపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని ఎస్పీ చెప్పారు.

Also Read – జగన్‌ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?

ఇది గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మద్య జరిగిన ఆర్ధికలావాదేవీ వలన ఏర్పడిన సమస్య అని అర్దమవుతూనే ఉంది. కానీ దీనిని సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఆపదిస్తూ, “అధికారం చేతిలో ఉంటే మాత్రం మరీ విచక్షణ మరిచిపోయి ఇంతలా బరితెగిస్తారా చంద్రబాబూ?ఇదేనా మహిళలకి మీరు ఇచ్చే గౌరవం?” అంటూ అప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు మొదలుపెట్టేసింది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసార రావు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, డాక్టర్ సుధాకర్, ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌, ఐపీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు వంటివారితో ఏవిదంగా పైశాచికంగా వ్యవహరించారో తెలుసు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో జరిగిన ఆరాచకాలకు, అకృత్యాలకు అంతే లేదు.

Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!

కానీ అవన్నీ మరిచిపోయినట్లు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటన జరిగినా దానిని ఈవిదంగా సిఎం చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తూ విమర్శిస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు.