వైసీపీ ది కుట్రయితే బీజేపీ ది.?

YSRCP and BJP political tension amid allegations of threat politics in Andhra Pradesh

వైసీపీ రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యాన్నే చెల్లిస్తుంది. అటు అధికారంలో ఉన్నా ఇటు విపక్షంలో ఉన్నా వైసీపీ రాజకీయంలో ఎటువంటి మార్పు ఉండడం లేదు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను భయపెట్టి రాజకీయం నడిపిన వైసీపీ విపక్షంలోకి వచ్చాకా పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ రాజకీయం చేస్తుంది.

ADVERTISEMENT

అయితే వైసీపీ ఈ బరితెగింపుకి, జగన్ బెదిరింపులకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ధీటైన కాంటర్ ఇవ్వలేకపోతున్నారు.

ఇక అటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వైసీపీ బెదిరింపు రాజకీయాలకు కళ్లెం వేయలేకపోతుంది. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ విధ్వంసాలకు, కూల్చివేతలకు పరోక్ష మద్దతు పలికిన బీజేపీ నేడు వైసీపీ బెదిరింపులను, హెచ్చరికలను చేసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా.?

వైస్ జగన్ మోడీ దత్తపుత్రుడు అంటూ షర్మిల చేస్తున్న విమర్శలకు, టీడీపీ, జనసేన క్యాడర్ నమ్ముతున్న ఆరోపణలను బీజేపీ తన నిశ్శబ్దంతో నిజం చెయ్యాలనుకుంటుందా.? కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ కి ఏపీ అభివృద్ధి పై బాధ్యత లేదా.?

ఇలా ఒక ప్రతిపక్ష పార్టీ అధినేత పారిశ్రామిక వేత్తలను మేము అధికారంలోకి వచ్చిన 2 నెలలకే జైలుకి పంపిస్తా అంటూ బెదిరిస్తూనే ఆ బెదిరింపులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత బీజేపీ కి లేదా.? అలాగే పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చే అవసరం బీజేపీ ఉండదా.?

ఇలా బీజేపీ నిశ్శబ్దం వైసీపీ లో బలం పెంచుతుంది అనే భావన ఏపీ ప్రజల పై పడితే దాని పర్యవసానాలకు బీజేపీ కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేది బీజేపీ ఇప్పటికి గ్రహించలేకపోతుందా.? నేడు కేంద్రంలో మోడీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టింది అంటే దానిలో సింహ భాగం ఏపీ లో కూటమికి దక్కిన ఘన విజయమే కీలక పాత్ర పోషించిన విషయం బీజేపీ విస్మరించిందా.?

వైసీపీ రాజకీయం, జగన్ బెదిరింపులు రాష్ట్రానికి ప్రత్యక్షంగా నష్టాన్ని కలిగిస్తుంటే, వైసీపీ పై బీజేపీ ఉదారత ఏపీని పరోక్షంగా దెబ్బతీస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసు దశాబ్దాల నాటి నుచి వాయిదాలతో సాగుతుంది, వైస్ వివేకా హత్య కేసు ఇప్పటికి దోషులను గుర్తించలేకపోయింది. దీని బట్టి చూస్తే వైసీపీ ది కుట్రయితే బీజేపీ ది ఏమనాలి.?

ADVERTISEMENT
Latest Stories