వైసీపీ నీతి ప్రవచనాలు…కేవలం వల్లెవేయడానికేనా.?

YSRCP Assembly controversy

నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణ మధ్య జరిగిన చర్చ వివాదాస్పదం గా మారడంతో ఇక దొరికిందే అవకాశం అన్నట్టుగా చెలరేగిపోతున్నాయి వైసీపీ సోషల్ మీడియా నుంచి వైసీపీ ఆత్మసాక్షి వరకు.

అలాగే జగన్ ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నీతి ప్రవచనాలు వల్లెవేస్తూ మీడియా ముందు క్యూ కడుతున్నారు వైసీపీ నాయకులు. పేర్ని నాని నుంచి బొత్స సత్యనారాయణ వరకు ప్రతి ఒక్కరు అసెంబ్లీ లో ఇటువంటి వ్యాఖ్యలా.?

ADVERTISEMENT

మాజీ ముఖ్యమంత్రి పట్ల బాలకృష్ణ ప్రవర్తించిన తీరు, మాజీ కేంద్ర మంత్రి, సినీ ఇండస్ట్రీ పెద్ద అయినా చిరు పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చాల అవమానకరంగా ఉన్నాయంటూ బొత్స, కూటమి ప్రభుత్వంలో బాబు కి సమానంగా పవన్ కు ప్రాధాన్యత నివ్వడం బాలకృష్ణ సహించలేకపోయారు అంటూ పేర్ని నాని,

అసలు సైకో బాలకృష్ణే అంటూ జోగి రమేష్ ఇలా వైసీపీ నేతలందరూ గంపగుత్తగా అసెంబ్లీ వంటి పవిత్ర ప్రదేశంను బాలకృష్ణ తన వ్యాఖ్యలతో అపవిత్రం చేసారు అంటూ వైసీపీ రాజకీయ ప్రవచనాలు చెప్పుకొస్తున్నారు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజంగా అభ్యంతర కరంగా ఉన్న మాట వాస్తవమే.

అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టడానికి మీడియా ముందు పోటీ పడుతున్న ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు నాడు అదే అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకు సంబంధం లేని నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు, ఆమె ఆత్మ గౌరవం మీద దెబ్బకొట్టినప్పుడు వికట్టహాసం చేసిన మాట వాస్తవం కదా.?

నాడు లేని ఆ అభ్యంతరం నేడు వ్యక్తపరచడమే వైసీపీ చేసే అతి పెద్ద పొరపాటు. నాటి వైసీపీ నేతల వ్యాఖ్యలను కూడా ఇదే రకంగా ఖండించి ఉంటే నేడు వీరికి బాలకృష్ణను తప్పుపట్టే అవకాశం ఉండేది.

నాడు అది వైసీపీ నేతల జన్మ హక్కు, వారికి రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కు అంటూ విర్రవీగిన వారు నేడు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా.? అసెంబ్లీని అపవిత్రం చేస్తారా.? అంటూ నిరసనలు తెలపడం ఎంతవరకు సమంజసం.?

ADVERTISEMENT
Latest Stories