2025 - Year Of Tragedies

నిన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలను కలిచివేసింది. అయితే ఈ ఏడాదిలో ఇటువంటి అనుకోని వరుస ప్రమాదాలు భారత్ ను మానసికంగా చాల కలవరపరుస్తున్నాయి.

ఈ ఏడాది కుంభమేళ తొక్కిసలాట తో భారత్ లో మొదలైన విషాదం ఇప్పటికి ఏదోఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లోని త్రివేణి సంగమంలో ఈ మహాకుంభమేళ వేడుకలు జరుగుతాయి.

Also Read – పరామర్శకు తలకాయలు.. రాజకీయాలకు మామిడి కాయలు!

అయితే ఈ ఏడాది జరిగిన మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు అమృత స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అనేకమంది భక్తులు గాయాలపాలవ్వగా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. జన్మకోసారి వచ్చే ఈ ఆధ్యాతిక వేడుకలో పాలుపంచుకోవడానికి ఆహ్లాదంగా కుటుంబాలతో కలిసి వెళ్లిన కొంతమంది భక్తులు తమ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చారు.

ఇక చేదు జ్ఞాపకం మరువకముందే కాశ్మీర్ లోని పెహాల్గమ్ ఉగ్రదాడి యావత్ భారతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏప్రిల్ 22 న పెహల్గామ్ లో జరిగిన విషాదం ఘటన 21 కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపింది. విహారయాత్రలకు వెళ్లిన కుటుంబాలకు చివరికి విషాదమే దక్కింది.

Also Read – మామిడి రైతుల సమస్యలకు బదులు జగన్‌ హంగామా హైలైట్!

మతం ఆధారంగా ఉగ్రవాదులు సృష్టించిన ఈ నర మేధం కు భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర తో బదులు చెప్పింది. అయితే ఈ ఉగ్రదాడి ఘటన భారత పౌరులను తీవ్రంగా కలిచివేసింది. దేశం మొత్తం ఒక్కతాటి మీదకొచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది.

2025 ఏడాది మొదలు అయ్యి నాలుగు నెలలు పూర్తి కాకముందే భారతదేశం రెండు ఊహించని ప్రమాదాలను ఎదుర్కొంది. అయితే ఇందులో ఒకటి తొక్కిసలాట ఘటన కాగా మరొకటి ఉగ్రదాడి సంఘటన. ఇక తాజాగా బెంగళూర్ లో జరిగిన మరో కార్యక్రమం మరికొంతమంది అమాయకులను బలి తీసుకుంది.

Also Read – కవిత మరో లేఖ…

18 ఏళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కింది, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 18 సీజన్ లో ఆర్సీబి జట్టు ఈసాల కప్ నందు అంటూ ఐపీఎల్ కప్పును చేజిక్కించుకుంది. ఐపీఎల్ ప్రాంచైజీ లలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రాంచైజీ ఆర్సీబీ, ఇందుకు ముఖ్య కారణం విరాట్ కోహ్లీ అనే చెప్పాలి.

అయితే ఈ సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో జరిగిన తొక్కిసలాట అనేక కుటుంబాలకు జీవిత కాల దుఃఖాన్ని మిగిల్చింది. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూడడానికి, వారి ఆనందంలో పాలు పంచుకోవడనికి, వేడుకలను కళ్లారా వీక్షించడానికి వచ్చి చివరికి విఘత జీవులుగా మిగిలిపోయారు ఆర్సీబీ అభిమానులు.

యువత, మహిళలు, చిన్నారులు సైతం ఈ విషాదంలో ప్రాణాలు విడిచారు. అనేకమంది ఈ తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వీటన్నిటికీ మించిన విషాదం లా వార్త విన్న ప్రతివారి కంట కన్నీరు తెప్పిస్తుంది. అయిన వారిని కలిసిరావడానికి వచ్చి ఒకరు, భార్య చివరి కోరిక తీర్చడానికి వచ్చి ఒకరు, సరదాగా విదేశాలకు వెళ్ళడానికి కొందరు..ఇలా మొత్తం 242 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ విమాన ప్రమాద ఘటనలో రమేష్ విశ్వాస్ ఒక్కడే మృత్యుంజయుడు గా బయటపడ్డారు. ఇక్కడ జరిగిన మరో విషాదం ఏంటంటే, విమానం క్రాష్ ల్యాండ్ అనేది జనావాసాలలో జరగడంతో ఈ విమానాలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు అసలు తమకేం సంబంధం లేని అమాయకులు కూడా రెప్పపాటులో ప్రాణాలు విడిచారు.

ఈ విషాద సంఘటన బాధిత కుటుంబాలనే కాదు ఇతర వ్యక్తులను సైతం కొన్నాళ్లపాటు వెండతూనే ఉంటుంది. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వరుస ప్రమాదాలతో అనేకమంది అమాయక ప్రజలు మృత్యువాత పడుతున్నారు.




పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లి కొందరు, విహారయాత్రలకు వెళ్లి మరికొందరు, విజయోత్సవ వేడుకలకు వెళ్లి ఇంకొందరు, ఇక ఇప్పుడు ఇలా లండన్ యాత్రకు బయలుదేరినవారంతా, ఒక్కరు తప్ప తాము చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాలను జీవత్సవాలను చేసారు. ఈ వరుస ప్రమాదాలతో ఈ ఏడాది ‘వైపరిత్యాల’ నామ సంవత్సరం కానుందా.?