ప్రతీ హీరోకి అభిమానులు ఉన్నట్లే ప్రతీ పార్టీకి కూడా ఉంటారు. కొందరు సినీ నటీనటు కూడా పార్టీలకు అభిమానులు కావచ్చు… ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అభిమానులలో నటుడు బ్రహ్మాజీ కూడా ఒకరు. విజయవాడ వరదలని నివారించడంలో, వరద బాధితులకు సహాయ చర్యలు చేపట్టడంలో టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు.
దానికి బ్రహ్మాజీ స్పందిస్తూ, “మీరు కరెక్ట్ సార్, వాళ్లు చెయ్యలేరు సార్.. ఇకనుంచి మనం చేద్దాం సార్. వరద బాధితులను ఆదుకునేందుకు ముందు మనం ఓ 1,000 కోట్లు రిలీజ్ చేద్దాం. తర్వాత మన వైస్సార్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదామన్నారు. ఎందుకంటే మనకు ప్రభుత్వం, అధికారం ముఖ్యం కాదు, జనాలు ముఖ్యం సార్. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్,” అని ట్వీట్ చేశారు.
Also Read – రేవంత్ రెడ్డి… ఆత్మపరిశీలన చేసుకుంటున్నారో లేదో?
అర్ధాలు, తాత్పర్యాలు వెతుక్కోకుండా చూస్తే బ్రహ్మాజీ చక్కగా చెప్పారనిపిస్తుంది. కానీ దాని అర్ధం, పరమార్ధం గ్రహించిన వైసీపి అభిమానులు బ్రహ్మాజీపై నిప్పులు చెరుగుతున్నారు. “సినిమాలో కామెడీ చేసుకుంటే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఇలా కామెడీ చేస్తే మూతిపళ్ళు రాలుతాయని,” ఓ వైసీపి అభిమాని బ్రహ్మాజీకి వార్నింగ్ ఇచ్చారు.
అయితే “గుమ్మడి కాయ దొంగంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, మంత్రులు విజయవాడలో అంతగా శ్రమిస్తున్నా జగన్, వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నారు కదా?” అని టిడిపి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read – టాలీవుడ్ హీరోలూ… మీకూ సిన్మా చూపిస్తాం రెడీయా?
అయితే టిడిపి-వైసీపి మద్యలో వేలు పెడితే నలిగిపోతుందని బ్రహ్మాజీ తొందరగానే గ్రహించిన్నట్లున్నారు. వెంటనే “అది నేను చేసిన ట్వీట్ కాదు. ఎవరో నా అకౌంట్‌ని హ్యాక్ చేసి అలా ట్వీట్ చేశారు. దాంతో నాకు సంబంధం లేదు,” అని ట్వీట్ వేశారు. అయితే చెప్పాల్సింది చెప్పేశాక ‘తూచ్’ అని బ్రహ్మాజీ తప్పుకున్నా సోషల్ మీడియాలో ఆయన ట్వీట్‌పై ఇరువర్గాలు ఇంకా కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి.
Also Read – ప్రగతి రధ చక్రాలు పంక్చర్ .. కొనకళ్ళ ఏమైనా చేస్తారా?