ఇస్తాంబుల్ లో దోపిడీకి గురైన నటీమణి!

Actress Saumya Tandon Robbed In Istanbulబాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో దోపిడీకి గురైంది. ‘భాబీజీ ఘర్ పర్ హై’ టీవీ సీరియల్ నటి సౌమ్యా టాండన్ స్నేహితులతో కలిసి ఇస్తాంబుల్ కు విహార యాత్రకు వెళ్ళగా, ఆ సమయంలో బయటకు వెళ్లాల్సి రావడంతో క్యాబ్ ఎక్కింది. ఆమెతో క్యాబ్ డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా దారి మధ్యలోనే క్యాబ్ ను ఆపేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె మీటర్ వేయలేదని సూచించడంతో వాగ్వాదానికి దిగాడు.

అతనితో అనవసరంగా గొడవ ఎందుకు? అని భావించిన ఆమె మూడు యూరోలు తీసి ఇవ్వగా, ఆ కరెన్సీ తమది కాదని చెబుతూ మళ్లీ గొడవకు దిగాడు. అంతే కాకుండా ఆమె ఒక్కతే ఉండడంతో ధైర్యంగా ఆమె పర్సులోని 800 యూరోలు (60,000 రూపాయలు) తీసుకుని పరారయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా క్యాబ్ రసీదు లేకపోవడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక ఆమె ఇస్తాంబుల్ కార్డ్ కు దరఖాస్తు చేసుకుని ట్రామ్ లలో ప్రయాణిస్తున్నట్టు తెలిపింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories