
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు దిగువ స్థాయి నేతల వరకు అందరికీ ఇంచుమించు ఒకేరకమైన మైండ్ సెట్ ఉంటుంది. దీనినే మరోవిదంగా చెప్పుకోవాలంటే అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళందరూ వైసీపి గొడుగు కింద చేరుతారు. ఆ మైండ్ సెట్‌నే పార్టీ విధానం అని కూడా అనుకోవచ్చు.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!
కనుక వైసీపిలో ఉండేందుకు ‘ప్రత్యేక అర్హతలు’ కలిగినవారు ఆ పార్టీలోనే ఇమడగలరు. కాదని వేరే పార్టీలోకి వెళ్ళినా ఇమడలేరు. ఇమడాలనుకున్నా వారి గుణం ఊరుకోనీయదు. ఇందుకు తాజా ఉదాహరణగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలే. ఓ మహిళతో ఆయన జరిపిన రాసలీలల వీడియో బయటకు వచ్చేసింది. దాంతో ఆయన షాక్ అయ్యారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అదో మార్ఫింగ్ వీడియో అని, తాను టిడిపిలో చేరడం ఇష్టం లేని వారెవరో దానిని సృష్టించారని కోనేటి ఆదిమూలం అన్నారు.
కానీ టిడిపి వెంటనే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయం తెలియజేస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంతకం చేసిన లేఖని ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read – జగన్ వెంట నడిస్తే ముగింపు ఇలాగే ఉంటుందా?
శాసనసభ ఎన్నికలలో కోనేటి ఆదిమూలం ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యవేడుకి బదులు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయమని జగన్ ఒత్తిడి చేయడంతో ఆయన టిడిపిలో చేరి సత్యవేడు నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు టిడిపి నుంచి సస్పెండ్ అవడంతో కోనేటి ఆదిమూలం మళ్ళీ వైసీపిలోకి వెళ్ళిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఆయన వస్తే వైసీపికి ఓ ఎమ్మెల్యే పెరుగుతాడు కనుక జగన్‌కి కూడా ఆ వీడియో పట్ల ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అయినా వైసీపి ఆర్చివ్‌లో అంతకంటే గొప్ప గొప్ప వీడియోలు చాలానే ఉన్నాయి కదా?
Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!