
ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న దక్షిణాది రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఒక్క విషయంలో మాత్రం తమినాడు ను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్న డీఎంకే రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలే, ఈ ఇద్దరు ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థులే.
అయినప్పటికీ తమిళనాడు రాజకీయాలలో జాతీయ పార్టీలు వేలు పెట్టబోతున్నాయి అన్న ఆలోచన వచ్చినా, లేక ఇక్కడి ప్రాంతీయత మీద ఉత్తరాది ఆధిపత్యం చూపించాలి అనుకున్నా, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ పై పెత్తనం చెయ్యాలని చూసిన వాటిని తిప్పికొట్టడంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకమై ఢిల్లీ పీఠం పై రాజకీయ పోరు సాగించడానికి వెనుకాడని సందర్భాలు ఎన్నో తమిళనాడు రాజకీయ చరిత్రలో లిక్కించబడ్డాయి.
Also Read – ఒకేసారి అన్ని హంగులతో అమరావతి.. అందరూ రెడీయేనా?
డీఎంకే కరుణానిధి నుంచి అన్న డీఎంకే జయలలిత వరకు ఇదే రాజకీయ సిద్ధాంతంతో ముందుకెళ్లి తమ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లోకి నడిపించుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో కొత్తగా పురుడు పోసుకున్న సినీ యాక్టర్ విజయ్ దళపతి పార్టీ TVK కూడా ఇదే బాటలో నడవబోతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా తమిళనాడులో మొదలైన త్రిభాషా విధాన వ్యతిరేక పోరు, పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ విధానం పై తిరుగుబాటు అంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై మొదలుపెట్టిన రాజకీయ యుద్దానికి గొంతు కలిపారు విజయ్.
Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
డీలిమిటేషన్ పేరుతో తమిళనాట పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని మోడీ వేస్తున్న వ్యూహాలు ఇక్కడ పారవంటూ విజయ్ బీజేపీ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు.
వన్ నేషన్..వన్ ఎలక్షన్ విధానంతోనే ఈ డీలిమిటేషన్ కు బీజేపీ పునాదులు వేసిందని, కానీ తమిళనాడును మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలని లేకుంటే దాని పర్యవసానాలను ఢిల్లీ పీఠం ఎన్నో సార్లు రుచి చేసిందన్నారు.
ఇక తమిళనాడు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి నిర్ణయానికైనా ముందుకొస్తే ఈ రాష్ట్రం తన శక్తిని చూపించడానికి వెనుకాడదంటూ బీజేపీ పై మండిపడ్డారు TVK అధినేత విజయ్. అయితే తమ లో తాము ఎన్ని రాజకీయ దోబుచులైన ఆడుకుంటాం కానీ మధ్యలో మూడు వ్యక్తి వస్తే మాత్రం ‘తమిళనాడు’ అనే ఎమోషన్ తో ఈ తమిళ తంబిలందరు ఒక్కటవుతారు అని విజయ్ తన ప్రకటనతో మరోమారు నిరూపించారు.
Also Read – జమ్ము కశ్మీర్ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
కానీ తమిళనాడు కి పొరుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణలో ఈ రకమైన రాజకీయం అరుదుగా కనిపిస్తుంది. తెలంగాణ వారు కనీసం మన తెలంగాణ అనే నినాదానికైనా ఒక్కటవుతారు. కానీ ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించదు. రాష్ట్ర మనుగడకు అత్యంత కీలమైన విషయాలలో కూడా ఉదాహరణకు ప్రత్యేక హోదా, వైజాక్ స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని అమరావతి ఇలాంటి ముఖ్య అంశాల మీద కూడా ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రాలేవు.
అలాగే ఇక్కడి నాయకులు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల క్షేమం కోసం కేంద్రం మీద వ్యతిరేక పోరు చెయ్యలేరు. కేంద్రం మీద టీడీపీ యుద్ధం ప్రకటిస్తే ఆ అవకాశాన్ని తన పార్టీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటూ బీజేపీ తో స్నేహ హస్తానికి ముందుకొస్తుంది వైసీపీ. బీజేపీ అండతో టీడీపీ ని దెబ్బకొట్టి జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే వైసీపీ మెయిన్ ఎజెండా.
వైసీపీ కాదంటే టీడీపీ, టీడీపీ కాదంటే వైసీపీ ఇలా ఏపీలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని ఎదిరించే సాహసం చెయ్యలేవనేది తేలిపోయింది. అందుకు తోడు ఇప్పుడు టీడీపీ ఎన్డీయే లో భాగమయ్యింది. కావునా ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
ముందుకొస్తే గొయ్యి, వెనకొస్తే నుయ్యి అన్న చందంగా తయారయ్యింది టీడీపీ, జనసేనల పరిస్థితి. ఇక నేరుగా బీజేపీ పై విమర్శలు కూడా చేసే దైర్యం కూడా చెయ్యలేని వైసీపీ తెరచాటు రాజకీయాలతో బీజేపీ తో లాలూచి భేరాలు నడపాల్సిందే తప్ప బీజేపీ కి వైతిరేఖంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఇలా ఏపీలో ఉన్న మూడు రాజకీయ పార్టీలు బీజేపీ కనుసన్నలలో నడవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
కానీ తమిళనాడులో ఈ రకమైన రాజకీయం ఎక్కడ కనిపించదు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తమ ఆత్మాభిమానం కోసం పార్టీలన్నీ కూడా తమ రాజకీయ సిద్ధాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కేంద్రం మీద యుద్దానికి సిద్ధమవుతారు, కానీ ఇక్కడ మాత్రం తమ ఆత్మ గౌరవాన్ని తగ్గించుకుని, తమ ఆత్మాభిమాన్ని పక్కన పెట్టి మరి కేంద్రానికి మద్దతు పలుకుతున్నారు.
అందుకే ఈ విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, అందరు నాయకులు తమినాడును ఆదర్శంగా తీసుకోవాల్సిందే అనే వాదన బలంగా వినిపిస్తుంది.