
వైసీపీ నేతలు వివిద కేసులలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే, వారేదో స్వాతంత్ర్య సమరయోధులన్నట్లు జగన్ వారిని పరామర్శించి వస్తుంటారు. పనిలో పనిగా జనాన్ని పోగేసుకొని రోడ్ షోలు చేసి పరామర్శ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని నాలుగు తిట్లు తిట్టడంతో ఆ తంతు ముగుస్తుంటుంది.
అమరావతిపై ‘వేశ్యల రాజధాని’ ముద్ర వేసినందుకు జైలు పాలైన కొమ్మినేని శ్రీనివాసరావుని పరామర్శించడానికి జగన్ వెళ్ళలేదు. ఎందువల్ల అంటే, ఆక్రమాస్తుల కేసులతో దాదాపు14 ఏళ్ళుగా, వివేకా హత్య కేసుతో దాదాపు 5 ఏళ్ళుగా చెడుగుడు ఆడుకుంటున్న జగన్‌కి ఈ కేసులు, బెయిల్ పిటిషన్ల సంగతి బాగా తెలుసు. కనుక కొమ్మినేనికి ఈరోజు బెయిల్ వస్తుందని జగన్ ముందే ఊహించి ఉండవచ్చు.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కొమ్మినేనికి బెయిల్ లభించినందనే సమాచారం అందగానే, జగన్ ఎక్స్ వేదికగా సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించి తన కడుపు మంట చల్లార్చుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడుకి చెంప దెబ్బ వంటిదే అని జగన్ ధ్రువీకరించారు. ఒకవేళ బెయిల్ నిరాకరించి ఉండి ఉంటే అప్పుడు టీడీపీ నేతలు ఇదే మాట అనేవారు కదా?
Also Read – నీళ్ళ నుంచి రాజకీయాలు వేరు చేయలేకపోతే.. కమిటీలు కాలక్షేపానికే!
జగన్ అమరావతిని వద్దనుకొని రాష్ట్రానికి లక్షల కోట్లు నష్టం వచ్చినా పాడుబెట్టేశారు సరే! కానీ ఇప్పుడు అమరావతిపై వేశ్యల ముద్ర వేయాలనుకోవడం చాలా తప్పు.
కానీ అలాంటి తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకువస్తూ జగన్ ట్వీట్ చేశారంటే దానర్ధం వారి చేత ఆయనే ఆ తప్పు చేయించారని భావించాల్సి ఉంటుంది. అందువల్లే ఆ విదంగా మాట్లాడటం తప్పని జగన్ అంగీకరించడం లేదనుకోవాలి.
Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ తరచూ ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా, పొదిలిలో వైసీపీ మూకలు పోలీసులు, మహిళలపై దాడులు చేయడం చూసినప్పుడు, జగన్ కోరుకుంటున్నట్లే జరుగుతోందనినిపిస్తుంది. అంటే రాష్ట్ర రాజకీయాలను జగన్ తెలివిగా తనకు నచ్చిన దారిలో నడిపిస్తున్నట్లు భావించవచ్చు.
జగన్ కుట్రల వెనుక మరొక బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది పాలనలో సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మళ్ళీ గాడిన పడుతోంది. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాలు, అభివృద్ధి గురించే మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కనుక జూన్ 12న ఏడాది పాలన ముగిసేరోజున ఏదో అట్టహాసం చేస్తారని జగన్ ముందే ఊహించారు. అందుకే నాలుగు రోజుల ముందుగానే వెన్నుపోటు, తర్వాత తెనాలి పర్యటన, సాక్షిలో ఈ వ్యాఖ్యలు, పొదిలి పర్యటనతో కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా టీడీపీని జగన్ రాజకీయంగా హైజాక్ చేశారని చెప్పవచ్చు.
ఆయన ప్లాన్ ఫలించింది కానీ అమరావతి వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. రాజకీయాలలో ఈ మాత్రం ప్లస్, మైనస్‌లు ఉంటాయని జగన్‌కు తెలుసు. కనుక ఏడాది పాలన గురించి చెప్పుకోవాలసిన టీడీపీ చేత ఈ అంశంపై మాట్లాడించేలా చేసి రాజకీయంగా హైజాక్ చేశారని చెప్పవచ్చు. జగన్‌కి ఈ తృప్తి చాలు.
ఇప్పుడు సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది కనుక అంతిమ విజయం తనదే అని జగన్ అనుకోవడం సహజమే.