
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇద్దరూ మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ముందు చంద్రబాబు నాయుడు ఇంటికి, తర్వాత నోటికి తాళం వేసుకోవాలని అంబటి ఉచిత సలహా ఇస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని, అందరినీ ముంచేయడమే ఆయన నైజమని గుడివాడ అమర్నాథ్ సెలవిచ్చారు.
Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!
విజయవాడ వరదలు, సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఇంతగా మాట్లాడుతున్న వీరిద్దరితో సహా వైసీపి నేతలు ఎవరూ ప్రకాశం బ్యారేజ్‌ని ఢీకొన్న మూడు బోట్ల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. ఇది వైసీపి కుట్రే అని అనుమానించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కొందరిని అదుపులో తీసుకోవడంతో, అంబటి, గుడివాడ వంటివారు ఆ బోట్ల వ్యవహారం గురించి మాట్లాడకుండా జాగ్రత్తపడుతూ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య నలుగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం గురించి మాట్లాడుతూ, ఆ వంకతో సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు.
అయితే వారిద్దరూ మంత్రులుగా ఏమి చేశారంటే ఏమీ లేదని అందరికీ తెలుసు. ఏమీ చేయకపోయినా, వారు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి ఇద్దరూ వెనకాడటం లేదు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
ఈవిదంగా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడినందుకే ఎన్నికలలో తాము, తమ పార్టీ ఘోరంగా ఓడిపోయామనే ఇంగిత జ్ఞానం లేకుండా, ఓడిపోయి పదవి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఈవిదంగా వంకర మాటలు మాట్లాడుతుండటం సిగ్గుచేటు.
Also Read – పోలీస్ గడప దాటించి కోర్టుకి తీసుకువెళ్తే చాలు.. కేసు ఫినిష్!