
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని లేకుంటే ఎప్పటికీ వెనుకబడిపోతాయని, కనుక విశాఖని రాజధాని చేయకపోతే ప్రత్యేక విశాఖ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెడతానని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు బహుశః అందరికీ గుర్తుండే ఉంటాయి.
విశాఖ రాజధాని అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నది వైసీపీ నేతలే. ఆ పేరుతో విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడింది వారే తప్ప విశాఖ నగర ప్రజలకు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
కానీ అధికార వికేంద్రీకరణ ఎంత ముఖ్యమో అభివృద్ధి వికేంద్రీకరణ అంత కంటే ముఖ్యం. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు దశాబ్ధాలుగా వెనుకబడి ఉండగా, మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందడంతో అసమానతలు పెరిగాయి.
కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సమానంగా, సమాంతరంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం ప్రణాళికాలు రచించుకొని, ఆ దిశలో అడుగులు వేస్తోంది.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
అటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రామాయపట్నంలో రూ.95,000 కోట్లు పెట్టుబడితో బీపీసీఎల్ కంపెనీ ఏర్పాటు కాబోతోంది. ఇంతకాలం అనకాపల్లి జిల్లా అంటే కేవలం బెల్లం దిమ్మలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అనకాపల్లి అంటే స్టీల్ ప్లాంట్, ఆయుధాలు, ఫార్మా కంపెనీలు, ఫార్మా యూనివర్సిటీ వంటివన్నీ జోడిస్తున్నారు సిఎం చంద్రబాబు నాయుడు.
పూడిమడక వద్ద ఎన్టీపీసీ-ఏపీ జెన్కో కలిసి రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాయి.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి. వీటికి ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపనలు చేశారు.
తాజాగా అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లి వద్ద 200 ఎకరాలలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను తయారుచేసే కేంద్ర ప్రభుత్వం సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఏర్పాటు కాబోతోంది.
అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి గ్రామం వద్ద 100 ఎకరాలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (నైపర్)అనే మరో కేంద్రప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ రాబోతోంది.
అనకాపల్లి అంటే కేవలం బెల్లం వ్యాపారం మాత్రమే అనుకునే చోట ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇంత పెద్ద పరిశ్రమలు, ఇంత ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటవుతాయని బహుశః జగన్, వైసీపీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరేమో?
“