‘పుష్ప’ ప్రభావం గట్టిగానే ఉంది!

Andhra Pradesh Employees pushpa movie slogans against Jagan govtఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన పీఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను కలిసికట్టుగా తెలియజేసారు. పోలీసులు ఎంతగా అడ్డుకున్నా, ప్రభుత్వం ఎన్ని నియంత్రణలు చేసినా… ఉద్యోగస్తుల నిరసన గళాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోయింది. ఈ నిరసనలలో ఓ రెండు విషయాలను ఉద్యోగస్తులు ప్రముఖంగా వినియోగించారు.

ADVERTISEMENT

ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాలోని ‘ఉ అంటావా… ఊఊ అంటావా…’ పాటను ఉదహరిస్తూ… “న్యాయం చేస్తావా… గద్దె దిగుతావా… ఉ అంటావా… ఊఊ అంటావా…” అంటూ జగన్ ను ప్రశ్నించారు. అలాగే ‘ఉద్యోగులంటే ఫ్లవర్ అనుకొంటివా… ఫైరు’ అన్న డైలాగ్స్ ను ప్రముఖంగా వినిపించారు. ‘మాట తప్పావు… మడమ తిప్పావు…’ అంటూ జగన్ నినాదాన్ని తూర్పారబట్టారు.

అలాగే సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన ‘సుఖీభవ సుఖీభవ’ను పోలుస్తూ… ‘అయ్యయ్యో వద్దమ్మా… అయ్యయ్యో వద్దమ్మా… పక్కనే సీఎం ఉన్నాడు, పెద్ద పీఆర్సీ ఇస్తామన్నాడు, రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నాడు, మన దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు… సుఖీభవ సుఖీభవ… సుఖీభవ సుఖీభవ… సుఖీభవ సుఖీభవ…’ అంటూ ఉద్యోగస్తులు చేసిన నిరసనలు ట్రెండ్ ను ఏ విధంగా ఫాలో అవుతున్నారో తెలియజేస్తున్నాయి.

కరోనా కారణమంటూ ప్రభుత్వం ఇవ్వదలచిన హెచ్.ఆర్.ఏను తగ్గించారు. మరి అదే కరోనా అందరికి వర్తిస్తుంది కదా, ప్రజల నుండి విపరీతంగా పెంచిన ఆస్తి పన్నును ఎలా వసూలు చేస్తోందని ప్రముఖ టిడిపి నేత జివి రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తామిచ్చేదానికి మాత్రం కరోనాను కారణంగా చూపుతున్నారు, వసూలు చేసే దానికి రాష్ట్ర ఆదాయం సాకుగా చెప్తున్నారని జగన్ సర్కార్ తీరును ఎండకట్టారు.

మొత్తమ్మీద ఉద్యోగస్తులు చేస్తోన్న నిరసన సెగలు ప్రభుత్వాన్ని తాకాయి. పైకి ఎన్ని ప్రకటనలు చేసినా, చివరికి మూడు రాజధానుల కధే రిపీట్ అవుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన అనేక జీవోలను వెనక్కి తీసుకున్న జగన్ ప్రభుత్వం, ఈ పీఆర్సీ జీవో కూడా వెనక్కి తీసుకుంటుందన్న భావన ఉద్యోగుల్లో కలుగుతోంది.


https://twitter.com/keerthiJSP/status/1484139958910976003

ADVERTISEMENT
Latest Stories