Andhra Pradesh Needs Industries Not Palaces

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన నిర్మాణాల గురించి చర్చించుకోవాల్సి వస్తే మాట్లాడుకోవాల్సిన ఒకేఒక్క నిర్మాణం రుషికొండ ప్యాలస్. జగన్ ఆ ప్యాలస్ నిర్మాణం పై పెట్టిన దృష్టిలో కాస్తంత ఒక పరిశ్రమను రాష్ట్రానికి ఆహ్వానించడం పై పెట్టి ఉంటే దాని ద్వారా ఎంతోకొంతమందికైనా రాష్ట్రంలో ఉపాధి దొరికుండేది.

ఆ ప్యాలస్ డిజైన్ ల మీద కేంద్రీకరించిన నిధులతో రాజధాని అమరావతిలో ఏదైనా ఒక నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఏపీ ఇలా రాజధాని పై రాజకీయ అనిచ్ఛతిని ఎదుర్కొనేది కాదు. నగరానికో ప్యాలస్ లు నిర్మించడం ఫలితంగా రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందదు, అవే నిధులు ఆదాయ వృద్ధి కోసం వెచ్చిస్తే ఫలితంగా అప్పులు లేని సంక్షేమం తో ప్రభుత్వం ముందుకెళ్లగలుగుతుంది.

Also Read – రేవంత్ తన మార్క్ చూపించబోతున్నారా.?

మూడు రాజధానులు అంటూ ఒకసారి, విశాఖే రాజధాని అంటూ మరొకసారి ఐదేళ్ల విలువైన కాలాన్ని, ప్రజలు తనకిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వైసీపీ కక్ష్య సాధింపు రాజకీయాల కోసం, నిర్మాణాల విధ్వంశం కోసం వినియోగించి భారీ మూల్యం చెల్లించుకుంది. విశాఖ రాజధాని అంటూ వైసీపీ చేసిన ప్రచారం వైసీపీ నాయకుల భూదందాలకు, అవినీతి, అక్రమాలకు ద్వారాలుగా మారాయి.

రాజధాని అంటూ పరిశ్రమలు కాకుండా ప్యాలస్ లు నిర్మించారు. రాజధాని అంటూ కొండల నుంచి బండల వరకు ప్రకృతి సంపదను దోచేశారు. అమరావతిలో నిర్మించిన ప్రజా వేదికతో మొదలైన వైసీపీ పాలన రుషికొండ నిర్మాణాలతో ముగిసింది. ఇక్కడ ప్రజలకు వాడుకలో ఉన్న నిర్మాణాలను కూల్చడం వైసీపీ అరాచకం అయితే అక్కడ ప్రజలకు ఉపయోగం లేని నిర్మాణాలను చేపట్టడం వైసీపీ వ్యర్థ ప్రయాసగానే మిగిలిపోయింది.

Also Read – లోకేష్ -కేటీఆర్…రహస్య భేటీ.?

కానీ నేడు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో విశాఖ వాసులను మోసం చెయ్యడం లేదు, అలాని విశాఖ అభివృద్ధి పై నిర్లక్ష్యం వహించడం లేదు. విశాఖను ఐటీ హబ్ గా నిలబెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను కూటమి ఒడిసిపట్టుకుంటుంది. అందులో భాగంగానే TCS కంపెనీకి భూకేటాయింపులు చేసింది.

టీడీపీ కూటమి తమకొచ్చిన ఈ ఐదేళ్ల సమయాన్ని ఇచ్చిన హామీల అమలు కోసమే కాకుండా రాష్ట్ర ప్రగతి కోసం కోసం సద్వినియోగం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటు రాజధాని అమరావతి నిర్మాణాలకు సమాంతరంగా అటు పారిశ్రామిక నగరంగా విశాఖను తీర్చిదిద్దుతుంది. ఇక రాయలసీమలో భాగమైన శ్రీ సిటీ లోను వివిధ కంపెనీలు తమ బ్రాంచ్ ల ప్రారంభ కార్యక్రమాలు ముగించుకున్నాయి.

Also Read – నీళ్ళు వాడుకోలేరు.. నీళ్ళ రాజకీయాలు మానుకోరు

నాడు వైసీపీ అయినా నేడు టీడీపీ అయినా వారి అంతిమ లక్ష్యం సంక్షేమ పథకాల అమలు కాకుడదు, ప్రజలకు అక్కరకు రాని విలాసాలు అవ్వకూడదు. నాడు జగన్ వేలకోట్లు వెచ్చించి నిర్మించిన ఋషి కొండ ప్యాలస్ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా, ప్రజలకు నిరుపయోగంగా మారింది.




ఇక నేడు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమల కోసం కూటమి ప్రభుత్వం ఆయా కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే ఆ నిర్ణయాలను తప్పుబడుతున్న వైసీపీ రుషికొండ ప్యాలస్ పై వెచ్చించిన 500 కోట్లను నిధులను సమర్ధించుకోవడం శోచనీయం అవుతుంది.