కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ కిక్ ఇస్తుందా?

Andhra Pradesh to Adopt Telangana’s Liquor Policy?

ఇదివరకు ప్రభుత్వాలు ‘మద్యం పాలసీ’ ప్రకటన ఓ సాధారణ వార్తగా ఉండేది. కానీ 5 ఏళ్ళ జగన్‌ ‘మద్య భీభత్సం’ తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వ మద్యం పాలసీ ఏవిదంగా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. జగన్‌ పాలనలో ఖరీదైన ‘జె బ్రాండ్’ లేదా నాసిరకమైన, కల్తీ మద్యం విరివిగా అమకాలు జరిగేవి.

ADVERTISEMENT

వాటితో మందుబాబులకి కిక్కు రాకపోగా జేబులు ఖాళీ అయిపోయేవి. ఆరోగ్యం కూడా చెడిపోయేది. కానీ మందుబాబులు తాగిన మద్యంతో వైసీపి నేతల జేబులు నిండుతుండేవి కనుక వారికి మంచి కిక్కు వచ్చేది. ఎంతగా అంటే భవిష్యత్‌లో మద్యం అమ్మకాలు కూడా ‘మూడు ఫుల్… ఆరు హాఫ్’గా సాగిపోతాయనే నమ్మకంతో ఆ అమ్మకాలను కూడా గ్యారెంటీగా చూపి రుణాలు తీసుకునే అంత!

కనుక జగన్‌ ప్రభుత్వ మద్య భీభత్సం చూసిన ప్రజలు టిడిపి కూటమి ప్రభుత్వం విధానం ఏవిదంగా ఉంటుందో అని ఎదురుచూడటం సహజం. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కనుక దానిని రూపొందించేందుకు మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లతో సిఎం చంద్రబాబు నాయుడు ఓ ఉప సంఘం ఏర్పాటు చేశారు. నేడు వారు సచివాలయంలో సమావేశమై నూతన మద్యం విధానంపై లోతుగా చర్చించారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, “గత ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ నాసిరకం మద్యం అమ్ముకొని ప్రజల ఆరోగ్యాలను దెబ్బ తీసి వైసీపి నేతలు జేబులు నింపుకున్నారు. జగన్‌ ప్రభుత్వం ఆర్ధిక విధానం ఎలాగూ సరిగా లేక రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది.

మద్యం విధానంలో కూడా వైసీపి నేతలు తమ స్వార్ధమే చూసుకున్నారు తప్ప ప్రభుత్వం, ప్రయోజనాలను, ప్రజల ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోలేదు. కనుక ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు నష్టం కలిగించని విదంగా మా మద్యం విదానం ఉంటుంది,” అని చెప్పారు.

రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. దానిలో మరోసారి చర్చించిన తర్వాత మద్యం విధానానికి ఆమోదముద్ర వేస్తారు.

రేపటి మంత్రివర్గ సమావేశంలో పంట నష్టపోయిన రైతులకు ఆర్ధిక సాయం, బుడమేరు ఆక్రమణల తొలగింపు, అమరావతిలో ప్రతిష్టాత్మకమైన సంస్థలకు భూకేటాయింపులు తదితర అంశాలపై చర్చించే అవకకాశం ఉంది.

ఈ నెల 20తో టిడిపి కూటమి ప్రభుత్వానికి 100 రోజుల పాలన పూర్తవుతుంది. కనుక రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలోనే మంత్రుల పనితీరుపై సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories