అన్ని పార్టీలలో ‘కాంగ్రెస్ డీఎన్ఏ కామన్’ అన్నట్లుగానే, టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏ కూడా కామన్బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలో తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా పట్ల ద్వేషం చాలా బలంగా ఉంటుంది. కనుక కల్వకుంట్ల కవిత మాటల్లో కూడా అదే కనిపిస్తుంటుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, మొన్న ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏదో ఇస్తారని, ఏదో చేస్తారనుకుంటే పొదుపు సూత్రాలు చెప్పి వెళ్ళిపోయారని, కానీ ఆంధ్రాకు మాత్రం మస్త్ పైసలిస్తున్నారని ఆక్షేపించారు.
అయితే ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో రూ.9,700 కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సావాలు చేసిన సంగతి కల్వకుంట్ల కవితకు తెలియదా? కానీ తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పి ఆంధ్రాకు మాత్రం పైసలిస్తున్నారని అసూయ దేనికి?
బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రాని, సిఎం చంద్రబాబు నాయుడుని ఇలా వ్యతిరేకిస్తూ, నదీ జలాల పేరుతో రాజకీయాలు చేసే బదులు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకొని, కాంగ్రెస్, బిజేపిలను నేరుగా ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తే ఆ రెండు పార్టీలకు దీర్గ కాలంలో మేలు కలుగుతుంది కదా?
ప్రధాని మోడీ పట్ల కేసీఆర్, సిఎం చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ద్వేషంతో రగిలిపోతే చివరికి ఎవరు నష్టపోయారు? అని ఒకసారి ఆలోచిస్తే కల్వకుంట్ల కవిత తన ఈ విధానాన్ని తప్పక మార్చుకుంటారు.
ప్రధాని మోడీ చెప్పిన పొదుపు సూత్రాలను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పాటించేందుకు సిద్దమవుతున్నారు. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్ తగ్గించుకోవాలని నిర్ణయించారు. మరి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అలాంటి ఆలోచన చేస్తున్నారా? కనీసం కేసీఆర్, కవిత చేస్తున్నారా? భారీ కార్ల ర్యాలీలు చేస్తూనే ఉన్నారు కదా?
అయినా ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ, ఆయనని ఈసడించుకుంటూ తమ కోర్కెలన్నీ తీర్చాలనుకుంటే ఆయనేమన్నా భోలాశంకరుడా? కానీ సఖ్యంగా ఉంటే కోరిన కోర్కెలు తీర్చుతూనే ఉన్నారుగా? ఆవిధంగానే సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేసుకుంటున్నారు కదా?
అలాగే కేసీఆర్ కూడా ప్రధాని మోడీతో సఖ్యతగా ఉంటూ తెలంగాణని అభివృద్ధి చేసుకోవచ్చు కదా? ఆయనని ఎవరైనా అడ్డుకున్నారా? లేదు కదా?
తెలంగాణలో తాను, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలనే దురాశతోనే నిత్యం అందరితో గొడవ పడుతూ తాము నష్టపోయి, పార్టీకి, రాష్ట్రానికి కూడా నష్టం కలిగించుకుంటూ ఆంధ్రా.. చంద్రబాబు నాయుడు అని బాధపడి ప్రయోజనం ఏమిటి?
ప్రధాని తెలంగాణకు వస్తే ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురుచూశారు.
కానీ తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పి…
నిధులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది.
–@RaoKavitha #TRS pic.twitter.com/8y6ra4aKMF
— M9 NEWS (@M9News_) May 13, 2026




