జగన్ 5 ఏళ్ళ పాలనలో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు, విధ్వంసాలు ఎన్ని జరిగాయో లెక్కలేదు. అంతర్వేదిలో స్వామివారి రధం దగ్దమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేశారు. దేవాలయాలలో దొంగతనాలు, అపచారాలకు లెక్కే లేదు. బెజవాడ కనక దుర్గమ్మ రాధంలో నాలుగు వెండి సింహాలు దొంగతనం అయ్యాయి. తిరుమలలో అన్యమత ప్రచారాలు, మద్యం, మాదక ద్రవ్యాలు, మాంసాహారం వంటి అపచారాలు ఎన్నెన్నో… లెక్కేలేదు.
చివరికి హిందువులు అందరూ భక్తి శ్రద్దలతో జరుపుకునే వినాయక చవితి పండగపై కూడా జగన్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. విగ్రహాల అమ్మకాలు, మంటపాల ఏర్పాటు మొదలు నిమజనం వరకు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టింది.
Also Read – టాలీవుడ్ హీరోలూ… మీకూ సిన్మా చూపిస్తాం రెడీయా?
ముఖ్యంగా గణేశ్ మంటపాల ఏర్పాటుకి అనుమతుల కోసం అగ్నిమాపక, విద్యుత్, మునిసిపల్, ట్రాఫిక్ పోలీస్, రోడ్లు భవనాల శాఖ, కాలుష్య నివారణ వంటి కార్యాలయాల మద్య తిరగాల్సి వచ్చేది. ప్రతీ శాఖకి నిర్ధిష్ట ఫీజ్ కూడా చెల్లించాల్సి వచ్చేది.
కానీ అవన్నీ అప్పుడే మరిచిపోయిన్నట్లు వినాయక మంటపాలు ఏర్పాటుచేసుకోవడానికి టిడిపి కూటమి ప్రభుత్వం ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం చేస్తోంది.
Also Read – రేవంత్ రెడ్డి… ఆత్మపరిశీలన చేసుకుంటున్నారో లేదో?
రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడి దృష్టికి ఈ విషయం రావడంతో ఆమె మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
2022లో జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని ఆమె మీడియాకి చూపిస్తూ, “గణేశ్ మంటపాలు ఏర్పాటు నియమ నిబందనలు, ఈ పాత జీవో గురించి 20 రోజుల క్రితమే అధికారులు నాకు చెప్పారు. అయితే ఒక్కో కార్యాలయానికి తిరగడం కష్టం కనుక గణేశ్ మంటపాలకు అనుమతిచ్చేందుకు మేము ‘సింగిల్ విండో’ ఏర్పాటు చేసి అనుమతివ్వాలని నిర్ణయించాము.
Also Read – సిట్టూ…బిట్టూ వద్దట… ఎందుకు జగన్మావయ్యా?
ఇదే విషయం మేము సిఎం చంద్రబాబు నాయుడుకి చెప్పగా ఆయన దీని కోసం ఎటువంటి ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించారు. అదేవిదంగా అనుమతులు మంజూరు చేస్తున్నాము. కానీ ఈ విషయం గురించి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలు పట్టుకొని, సోషల్ మీడియాలో వైసీపి దుష్ప్రచారం చేస్తోంది.
అంటే వైసీపి రాజకీయాలు చేయడానికి సమయం, సందర్భం అవసరం లేదని నాకు అర్దమైంది. నీచ రాజకీయాలు చేయడంలో వైసీపి ఆరితేరిపోయింది,” అని అన్నారు.
జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్నీ పది రోజుల క్రిందటే రద్దు చేసాం
— (@Shiva4TDP) September 8, 2024