Anna Canteen Pulivendula

వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, అలాగే వైస్ కుటుంబానికి కంచుకోట అని చెప్పబడే పులివెందులలో రేపు టీడీపీ మానస పుత్రిక అయిన అన్న క్యాంటిన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది.

కులం..చూడం, మతం..చూడం, పార్టీ..చూడం అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలన్నీ ప్రకటనలకే పరిమితం అయితే వాటిని ఆచరణ సాధ్యం చేస్తున్నారు ఇప్పటి ముఖ్యమంత్రి బాబు. అందులో భాగంగానే పులివెందులలో అన్న క్యాంటిన్ ఏర్పాటుకు రంగం సిద్దమవుతుంది.

Also Read – ఆంధ్రాపై కేసీఆర్‌ ఎఫెక్ట్.. తగ్గేదెప్పుడు?

తానూ అధికారంలో ఉన్నపుడు వై నాట్ కుప్పం అంటూ విర్రవీగిన జగన్, కుప్పం ప్రజల అవసరాలకు ప్రతి ఇంటికి తాగు నీరు, ప్రతి ఎకరాకు సాగు నీరు అంటూ సినిమా సెట్టింగ్ మాదిరి సెట్టింగ్లు వేసి అక్కడి ప్రజలను ఏమార్చాలని చూసారు.

అయితే జగన్ ఉచ్చులో ఇరుక్కోవడానికి అటు కుప్పం ప్రజలే కాదు ఇటు ఏపీలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా సిద్ధంగా లేరని నిరూపించి జగన్ ను పులివెందులకు పరిమితం చేసారు.

Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం

అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వై నాట్ పులివెందుల అంటూ రాజకీయం మొదలు పెట్టకుండా, గెలిచింది మన పార్టీ నాయకుడు కాదు అని ఆ ప్రాంత ప్రజలను విస్మరించకుండా, నాయకుడు రాజకీయ ప్రత్యర్థి అయినా ప్రజలు తన వారని భావించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలో కూడా అన్న క్యాంటిన్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.

5 రూ. లకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే ఉద్దేశంతో 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లను 2019 లో అధికారం చేపట్టిన వైస్ జగన్ తొలగించడం తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Also Read – బిఆర్ఎస్..కాంగ్రెస్ కుర్చీల ఆటలో బీజేపీ అరటిపండా.?

ఈ నేపథ్యంలో రేపు జగన్ నియోజకవర్గమైన పులివెందుల గాంధీ సర్కిల్ నాలుగురోడ్ల కూడలి వద్ద అన్నక్యాంటీన్ ప్రారంభం కానుంది అంటూ టీడీపీ తన సోషల్ మీడియా వేదిక గా ప్రకటించింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్ మీద విషం కక్కే పులివెందుల ఎమ్మెల్యే కూడా ఇక్కడ 5రూ లకే నాణ్యమైన ఆహారాన్ని తీసుకువచ్చు అంటూ టీడీపీ శ్రేణులు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ అన్న క్యాంటిన్ ప్రారంభిస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలుస్తుంది అనే ఆశతోనో, లేక జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. తమ ప్రభుత్వానికి అన్ని నియోజకవర్గాలు సమానమే అని చాటి చెప్పడానికి ఇది ఒకో చక్కటి ఉదాహరణగా భావించవచ్చు.

తానూ వద్దనుకున్న అన్న క్యాంటీన్ ను తన నియోజకవర్గంలోనే ప్రారంభిస్తున్న టీడీపీ కూటమి నిర్ణయాన్ని ఇప్పుడు జగన్ వ్యతిరేకించగలరా.? తన నియోజకవర్గ ప్రజలకు 5రూ నాణ్యమైన భోజనం అవసరం లేదని, అన్న క్యాంటీన్ ఏర్పాటును అడ్డుకునే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా.?

పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ సెలవిచ్చిన ఆ పేదవాడు బెంగళూరు టూ తాడేపల్లి ఫ్లయిట్ లలో తిరుగుతుంటే పెత్తందారుడు అని చెప్పబడిన చంద్రబాబు పేదల కడుపు నింపడానికి ఊరూరా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికైనా పేదవాడికి కావాల్సింది కాస్టలీ చీప్ లిక్కర్ కాదు, చీప్ గా నాణ్యమైన భోజనం అనేది జగన్ కు అర్ధమవుతుందా లేదా.?