ఏపీ మంత్రి నారాయణ కొడుకు దుర్మరణం!

హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి ధ్వంసమైంది. ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ టీఎస్ 07 ఎస్ కే 7117 కావడంతో ప్రముఖుల కుమారులే ఆ కారులో ఉన్నారని అనుమానించగా…ఆ కారులో ఉన్నది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రవివర్మ ఉన్నట్టు గుర్తించారు.

కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చేదు వార్త వినాల్సి వచ్చింది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది.

ADVERTISEMENT

కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. భారీ శబ్దం కావడంతో తాము నిద్రనుంచి లేచి చూశామని, అయితే కారులోంచి సీట్లు బయటకు వచ్చేసినంత వేగంతో ఆ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. గత రెండు రోజులుగా ఆ కారు తెల్లవారు జామున అతివేగంగా దూసుకువచ్చేదని వారు వెల్లడించారు. కాగా, ఎంతో భవిష్యత్ ఉన్న నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంపై విచారం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT
Latest Stories