రాష్ట్ర బీజేపీ నాయకుల వాదన వింతగా ఉంది. కేంద్రం నుంచి ఇప్పటికే వచ్చిన నిధులకు లెక్కలు అడగడంతోనే చంద్రబాబు బీజేపీని వదిలి పారిపోయాడని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిళ్ల రఘురామ్ ఆరోపించారు. లెక్కలు చెప్పాల్సి వస్తే తన అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు.
ఎన్డీయే నుండి చంద్రబాబు పారిపోతే లెక్కలు చెప్పకర్లేదా? నిజంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగితే ఎన్డీయేలో టీడీపీ ఉన్నా లేకపోయినా సమాధానం చెప్పాలి కదా? అసలు ఇప్పటిదాకా కేంద్రం దీనిపై అధికారికంగా ఎందుకు స్పందించలేదు. బీజేపీ వారి ఆరోపణలు తప్ప రాష్ట్రం లెక్కలు చెప్పలేదని కేంద్రం చెప్పిందా?
కావున ఇవన్నీ కేవలం రాజకీయంగా చేసే ఆరోపణలు అనుకోవాలా? హోదా అనే పేరులో వివాదం ఉందని, అది ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారని అన్నారు. విభజన చట్టంలోని హామీలను అన్నింటిని అమలుచేసి హోదాకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఇదేమి వాదనో మరి!



