తెలుగు దేశం పార్టీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక ఆ పార్టీపైనా చంద్రబాబు నాయుడు పైనా సోషల్ మీడియాలో ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా ఎటాక్ చేస్తున్న వారిలో ఏపీకి చెందిన వారు 5% లోపే ఉంటారని విశ్లేషకుల అంచనా.
ఇదంతా బీజేపీ పెయిడ్ బ్యాచ్ పని అని తెలుస్తుంది. బీజేపీ ఐటీ సెల్ పేరిట ఢిల్లీలో ఒక టీమ్ ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది వారికింద పని చేస్తూ ఉంటారు. వారి పని ఏంటంటే ఐటీ సెల్ ఇచ్చిన ట్వీట్లు రకరకాల ట్విట్టర్ అకౌంట్లు తాయారు చేసి పోస్టు చెయ్యడమే. అలా వేసిన ప్రతి ట్వీటుకు ఇంత అని ముట్టచెబుతారు.
ఇలా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్న చాలా మందికి కనీసం జ్ఞానం ఉండదు. కొందరు చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, కొందరు హైదరాబాద్ లాంటి నగరం ఉండగా ఏపీకి కేంద్ర సాయం ఎందుకు అని ఇలా ఏపీ గురించి విభజన గురించి కనీసం జ్ఞానం లేకుండా వ్యాఖ్యానం చెయ్యడం విశేషం. అయితే టీడీపీ క్యాడర్ కూడా దీనిని సమర్ధవంతంగానే తిప్పి కొడుతుంది.



