మూడో స్థానం మెంటాలిటీ… అదే పెద్ద సమస్య!

BJP Stays Third in Telangana Municipal Election Results

తెలంగాణలో బిజేపి, ఢిల్లీలో వారి అధిష్టానం కూడా తెలంగాణ రాజకీయాలను సీరియస్ తీసుకున్నట్లు కనపడరు. మున్సిపల్ ఫలితాలలో మూడో స్థానంలో నిలవడమే ఇందుకు తాజా నిదర్శనం.

యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, చివరికి తమకు పట్టులేని తమిళనాడు, కేరళపై చూపుతున్న శ్రద్ధ తెలంగాణపై చూపి ఉండి ఉంటే నేడు బిజేపి అధికారంలో ఉండేది. కానీ వారి అధిష్టానం మిత్ర లాభం కంటే మిత్ర భేధాన్నే నమ్ముకొని నేటికీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుండటమే తెలంగాణ బిజేపికి శాపం.

ADVERTISEMENT

తమది ఖచ్చితంగా మూడో స్థానమే అని తెలిసి ఉన్నప్పటికీ ‘మేమే గెలుస్తాం… మేమే అధికారంలోకి వస్తామనే భ్రమ లేదా మేకపోతు గాంభీర్యంతో కాలక్షేపం చేయడానికే తెలంగాణ బిజేపి నేతలు మొగ్గు చూపుతుంటారు.

కాస్త పట్టు పడితే నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పోరేషన్లపై పట్టు సాధించినట్లు యావత్ రాష్ట్రంపై కూడా సాధించే అవకాశం ఉన్నా ఎవరికీ ఆసక్తి లేదు. ఎవరూ చొరవ తీసుకోరు.

ఎందుకంటే ఎంత కష్టపడినా చివరికి అధిష్టానం ఎటువైపు పిల్లి మొగ్గ వేస్తుందో తెలియదు గాబట్టి.

అందుకే ఇలాంటి ఫలితాలతో మూడో స్థానం… సర్దుకుపోవాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories