టిఎన్ ముఖ్యమంత్రి ఇంటిని పేల్చేస్తామని ఫోన్!

Bomb Threat Jayalalithaa, Bomb Threat Jayalalithaa Residance, Bomb Threat Tamilnadu CM  Jayalalithaa, Bomb Threat CM Jayalalithaa House తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ చెన్నై సిటీ పోలీస్‌ కంట్రోల్‌ రూంకి ఓ ఆగంతకుడు ఫోన్‌ చేసి బెదిరించాడు. పొయెస్‌ గార్డెన్‌ లోని జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ ఫోన్ లో హెచ్చరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆఘమేఘాల మీద పొయెస్ గార్డెన్ కు భద్రతను పెంచి, వచ్చిన కాల్ పై దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఈ ఫోన్‌ కాల్‌ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు.

ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసు బృందాలు మరకణ్ణం చేరుకుని, ఆగంతకుడు చేసిన పోన్ కోసం గాలించారు. చివరికి ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తానని బెదిరించింది భువనేశ్వరన్ అనే ఓ 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. దీంతో బాలుడిన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాంబు బెదిరింపును మాత్రం తేలిగ్గా తీసుకోని అధికారులు పొయెస్ గార్డెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories