‘వన్ మూవీ వండర్’ మాదిరి ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, విమర్శకుల అభినందనలు అందుకున్న భాస్కర్, ఆ తర్వాత ‘పరుగు’ మూవీతో పర్వాలేదనిపించారు. కానీ, ఆ తర్వాత భాస్కర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రామ్ చరణ్ తో తీసిన ‘ఆరెంజ్,’ రామ్ తో తీసిన ‘ఒంగోలు గిత్త’ సినిమాలు దారుణ పరాజయాలు చవిచూడడంతో తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత ఓ స్టార్ హీరోతో తెలుగులో అవకాశం అందిపుచ్చుకున్నాడన్న సమాచారం హల్చల్ చేస్తోంది.
వరుస సక్సెస్ లతో మాంచి ఊపుమీదున్న ‘నాచురల్ స్టార్’ నాని దగ్గర నుండి భాస్కర్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారని తెలుస్తోంది. నానితో ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అరవింద్. తాజాగా మరోసారి జత కడుతుండడం విశేషం. ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే… దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. నాని – దేవిశ్రీ కాంభినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం ఇదే కాగా, బొమ్మరిల్లు భాస్కర్ తొలి సినిమాకు దేవియే స్వరమాంత్రికుడు.



