రాజకీయాలు చేయడానికి కూడా సమయం, సందర్భం, వేళ, పాల అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ జగన్ ఈ పరిమితులను ఎప్పుడు గౌరవించలేదు, ఎప్పుడు ఆ హద్దులకు కట్టుబడలేదు. తానూ ఎదగడానికి తన పార్టీని ఏ స్థాయికైనా దిగజార్చగలరని జగన్ మరోసారి నిరూపించుకున్నారు.
Also Read – బెంగుళూరు ప్యాలస్‌లో అపరిచితుడు
తన అనాలోచిత చర్యల ఫలితంగానే వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది వైసీపీ నేతలు కూడా ఒప్పుకునే వాస్తవమే. అయితే వరద రాజకీయాలతో ప్రభుత్వం పై బురద జల్లడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ పాలిట శాపంలా మారుతున్నాయి.
విజయవాడలోని ప్రకృతి బీభత్సానికి రాజకీయ విమర్శలు జత చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని మరో మెట్టు కిందకు చేర్చాయి.ఈ వరదలు మాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ ఒకసారి, బాబు కి నిద్రపట్టదు కాబట్టి అర్ధరాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటూ మరోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విలువలను దిగజార్చాయనే చెప్పాలి.
Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?
బాబు ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇక్కడ బస్సులలో ఉంటూ ఎదో ప్రజల కోసమే ఉంటున్నట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారంటూ ఇలా ఇంతకన్న దిగజారుడు అన్న ప్రతిసారి జగన్ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ దిగజారుతూనే ఉన్నారు. రాష్ట్రంలో మారింది ముఖ్యమంత్రి పదవి మాత్రమే అధికారం మాదే అనేలా జగన్ కూటమి ప్రభుత్వం పై అర్ధం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ పేట్రేగిపోతున్నారు.
అయితే వీటి మీద స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ఇది సందర్భం కాదు, ప్రత్యర్థి వ్యాఖ్యలకు సంజాయిషీ చెప్పడానికి మాకు సమయము లేదు అంటూనే జగన్ కు గట్టి కౌంటర్ వేశారు. అమరావతి మునిగిపోతుంది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని తీసుకొచ్చి అక్కడే ముంచాలి, రాజధానిని స్మశానం అన్నవారిని అక్కడే పూడ్చాలి అంటూ వైసీపీ నేతలకు చెంప మీద కొట్టినట్టు సరైన సమాధానం చెప్పారు.
Also Read – వందే భారత్‌కి ప్రధాని పచ్చ జెండాలు ఇంకెంత కాలం?
సహాయ చర్యలకు ముందుకు రాకపోయినా పర్లేదు కానీ ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్ ను దెబ్బ తీసే ఇటువంటి వారికి సంఘ బహిష్కరణే సరైన చర్య అవుతుందన్నారు. అప్పుడే వీరికి బుద్ధి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది అంటూ పరోక్షంగా జగన్ పై మండిపడ్డారు బాబు.
నేరచరిత్ర కలిగిన వారు రాజకీయాలకు వచ్చి మమల్ని భయపెట్టాలని చూస్తే భయపడడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరనే విషయాన్ని వైసీపీ గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరికలు పంపారు. ఇలా తప్పుడు ప్రచారాలతో, ప్రజలను రెచ్చకొట్టే ధోరణితో ఏకపక్ష రాజకీయాలు చేసే వారు నిజంగా సమాజాన్ని నాశనం చేసేస్తారు. ఇటువంటి వారికి బాబు చెప్పినట్లు సంఘ బహిష్కరణో, రాష్ట్ర బహిష్కరణో సరైన చర్య అవుతుందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.
అలాగే ఇంట్లో కూర్చుని ప్రభుత్వం పై విమర్శలు చెయ్యడం కాదు, ఫీల్డ్ లోకి వచ్చి సాయమందించి నిరాశ్రయులను ఆదుకోవాలి, హీరోల దగ్గర కంటే ఎక్కువ స్థాయిలో జగన్ దగ్గర డబ్బులున్నాయి. కానీ ఏనాడూ ఇటువంటి విపత్తులో తనవంతు బాధ్యతగా జగన్ ముందుకొచ్చి చేయుత అందించిన ఆనవాళ్లు లేవు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటుగా జగన్ మద్దతుదారులకు కూడా మరోసారి జ్ఞప్తికి తెచ్చారు డిప్యూటీ సీఎం పవన్.
గతంలో విశాఖ కేంద్రంగా వచ్చిన హుదూద్ కల్లోల్ల సమయంలో కూడా ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి జగన్ 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించారు. కానీ అది ఇప్పటికి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థకు అందలేదు. అలాగే ఇప్పుడు పార్టీ తరుపున జగన్ ప్రకటించిన కోటి రూపాయిల సాయం కూడా పత్రికా ప్రకటన రూపంలోనే ముగుస్తోందా లేక ఆచరణ సాధ్యమవుతుందా అనేది అంతు చిక్కని ప్రశ్నే అంటున్నారు కూటమి నేతలు.
ఆర్బాటం ఆరు నెలలు జీతం మూడు నెలలు అన్న చందంగా జగన్ చెప్పేది కొండంత చేసేది నూలు పొగంతా అంటూ జగన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఒక్కసారి ప్రజలలో విశ్వసనీయత కోల్పోతే ఎలా ఉంటుందో అనేది వైసీపీ పార్టీకి తెలిసినంతలా దేశంలో మరే రాజకీయ పార్టీకి తెలిసి ఉండక పోవచ్చు. జగన్ కు దాని ఫలితం కళ్ళ ముందు కనపడుతున్న ఇంకా తత్త్వం భోధపడడం లేదు.