ఇది మెగాస్టార్ చిరంజీవి గురించి కాదు… వైసీపి నేత గుంటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి గురించి. వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు వార్డు మెంబర్ వరకు ప్రతీ ఒక్కరూ నీతి నిజాయితీ అంటూ మాట్లాడుతుంటారు. కానీ ఎవరి చరిత్ర తిరగేసిన ఓ అవినీతి అధ్యాయం కనబడుతుంది.
Also Read – బాణమనుకుంటే బల్లెంలా మారిందేమిటి?
గంజి చిరంజీవి కూడా ఇందుకు అతీతుడుకాడని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చి చెప్పేసింది. వైసీపి అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ళ నిర్మాణం, కేటాయింపులలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కనుక సీఐడీ లేదా మరేదైనా ప్రత్యేక దర్యాప్తు బృందం చేత లోతుగా దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో గంజి చిరంజీవి కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై భారీగా అంచనాలు పెంచేసి చేతివాటం ప్రదర్శించారని, అయినప్పటికీ నిర్మాణాలు చాలా నాసిరకంగా ఉన్నాయని తెలిపింది.
Also Read – అయితే కొడాలి నానికి ముహూర్తం పెట్టేసినట్లేగా?
టిడ్కో ఇళ్ళ కేటాయింపులో కూడా గంజి చిరంజీవి చేతి వాటం ప్రదర్శించారని, లబ్ధిదారుల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేసి జేబులో వేసుకున్నారని, ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇళ్ళు కేటాయించారని, అర్హులను కాదని అనర్హులకే ఇళ్ళు కేటాయించారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చి చెప్పేసింది.
శాసనసభ ఎన్నికలలో గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపి అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు ఇదే కారణంగా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కనుక జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో ఆయన స్థానంలో మురుగుడు లావణ్యని బరిలో దింపాల్సి వచ్చింది.
Also Read – జగన్ సంక్రాంతికే.. ప్రీ రిలీజ్ ఈ నెలలోనే!
కానీ వైసీపిలో ఈ అవినీతి భాగోతాల వలననే ఆమె కూడా ఓడిపోయారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు కూడా.
కానీ వైసీపి అధికారంలో ఉండగా చేసిన పాపాలకు ఇప్పుడు చిరంజీవిని గంజి పెట్టి ఇస్త్రీ చేయక తప్పదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చెపుతోందంటే మరి తప్పదు కదా!