సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకం సాధించడం విశేషం. ఈసారి మోడీ ప్రభుత్వానికి టిడిపి మద్దతు కీలకం కావడంతో ఆయన అభ్యర్ధనలు, ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తోందని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ జగన్ పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వచ్చిన్నట్లే ఉన్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి సాధించుకున్నవి క్లుప్తంగా…
· విశాఖలోనే రైల్వే జోన్… దానిలో కొత్తగా వాల్తేర్ డివిజన్ ఏర్పాటుకి కేంద్రం అంగీకారం. డిసెంబర్ ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారు.
· రామయంపట్నం వద్ద రూ.85,000 కోట్లతో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు.
· నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఏపీ జెన్‌కో కలిసి లక్ష కోట్ల పెట్టుబడితి విశాఖపట్నంలో గ్రీన్ సిగ్నల్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాయి. దానికి నవంబర్‌లో శంకుస్థాపన జరుగుతుంది.
· పోలవరానికి ప్రకటించిన రూ.12,500 కోట్ల ఆర్ధిక సాయంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే సోమవారం కొంత విడుదల చేయబోతోంది. రెండేళ్ళలో తొలిదశ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
· ప్రపంచ బ్యాంక్ నుంచి త్వరలో రూ.15,000 కోట్లు రుణం వస్తుంది. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు మొదలవుతాయి.
· భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2025 డిసెంబర్‌లోగా పూర్తవుతుంది.
· భోగాపురంలో సివిల్ యావియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరిన్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు.
· విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ నిర్మాణం త్వరలో పూర్తికాగా తూర్పు బైపాస్ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయి.
· అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం నగరాలతో అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైల్వేలైన్లు నిర్మించాలని సిఎం చంద్రబాబు నాయుడు కోరగా రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారు.
· ఇంకా అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్, రాష్ట్రంలో అనేక హైవే రోడ్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులకు, యూనివర్సిటీలు, సెమీ కండక్టర్, డ్రోన్‌లు తయారీ పరిశ్రమలకు సంబందించి కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని,
తాను, తమ ఎంపీలు వాటి గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వీలనవన్నీ సాధించుకుంటామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.




