
చరిత్ర చూడనంత వరద ఉధృతి విజయవాడ నగరాన్ని ముంచెత్తడంతో బెజవాడ అష్టదిగ్భంధనంలా మారింది. నగరానికి నలుమూలాల ఉన్న చిట్టినగర్, భవానీపురం, రామవరప్పాడు, సుందరయ్య నగర్, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు తదితర ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ తాను ఉన్నానంటూ భరోసా కల్పించగల నేత ఎవరైనా ఉన్నారంటే, మొదటగా గుర్తుకు వచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. 74 ఏళ్ళ వయసులోనూ అలుపెరుగని యోధుడిలా కంటి మీద కునుకు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూపిస్తోన్న తపనకు ప్రజలంతా ‘హ్యాట్సాఫ్’ అంటున్నారు.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
వరద ఉధృతి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన మరుక్షణం నుండి అనుక్షణం స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ, స్వయంగా పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉధృతిని చూసి అధికారులు కూడా వెనుకడుగు వేసే ప్రాంతాలలో, స్వయంగా వరద నీటిలోకి ప్రవేశించి ప్రజలకు అభయాన్ని అందిస్తున్నారు.
బహుశా ఈ సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుని తప్ప మరొకరిని ప్రజలు ఊహించుకోవడానికి కూడా భయం వేసే పరిస్థితి. ఇదే సమయంలో 2024 మార్చి వరకు సీఎంగా విధులు నిర్వహించి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి యధావిధిగా చిరుదరహాసం చిందిస్తూ ప్రజలను పలకరించడానికి విచ్చేసారు.
Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?
ప్రజలు కష్టంలో ఉంటే కొమ్ము కాసే నాయకుడు ఒకరైతే, ప్రజల కష్టాన్ని చూసి ఆనందించే నాయకుడు మరొకరు. ‘శవాల మీద పేలాలు ఏరుకునే’ మాదిరి ఈ సమయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించిన జగన్ ను ప్రజలే వెనక్కి పంపారు. ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలతో సంతృప్తి చెందిన ప్రజల మాటలు జగన్ కు ఏ మాత్రం రుచించకపోవడంతో, మోము మీద ఉన్న షిక్కటి చిరునవ్వు పోయి వెనువెంటనే తాడేపల్లి ప్యాలెస్ కు పయనం అయ్యారు.
ప్రకృతి సృష్టించిన ఈ అలజడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ఒక విపత్తులా మారగా, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ మోహన్ రెడ్డికి ఒక విహార యాత్రగా మారింది. ప్రజల కష్టాలను చూసి నవ్వుకునే నాయకుడు చరిత్రలో జగన్ మోహన్ రెడ్డి మినహా మరొకరు ఉండరేమో అని చీదరించుకునే స్థితికి జగన్ చేరుకోగా, ఇంత వయసులోనూ విపత్తు నుండి ఎలా బయటపడాలో తపన పడుతోన్న చంద్రబాబుకు నీరాజనాలు పలకడం ప్రజల వంతవుతోంది.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
ఈ సమయంలోనే గతంలో విశాఖలో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ ను జ్ఞప్తికి తెచ్చుకోవడం విజయవాడ వాసుల వంతవుతోంది. నాడు చంద్రబాబు సంకల్పంతోనే హుద్ హుద్ నుండి విశాఖ త్వరగా కోలుకోగా, అదే సంకల్పంతో నేడు విజయవాడను రక్షించే బాధ్యతను భుజానకెత్తుకుని కష్టపడుతున్నారు.
అలాగే జరిగిన విపత్తుతో బాధితులు ఆందోళన చెందుతు బిక్కు బిక్కు మని రోడ్ల మీద గడుపుతుంటే, ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్న కృష్ణమ్మ పరవళ్లు కళ్లారా చూడడానికి, ఆ పరవళ్లను తమ ఫోన్ లలో బందిచడానికి, ఆసక్తి చూపుతూ వరద బాధిత ప్రాంతాలను సందర్శించడానికి వాటిని ఒక విహార యాత్రగా భావించి తండోపతండాలుగా ప్రజలు రోడ్ల మీద సందడి చేస్తున్నారు.
అయితే జగన్ చేసేవిహార యాత్రకు పోలీసుల భద్రతా, కార్యకర్తల జై జగన్ అనే నినాదాలు ఉంటే సామాన్యుడి విహారయాత్రకు పోలీసుల అడ్డంకులు ఉంటున్నాయి. ఏదిఏమైనా ఒకరి విపత్తు మరొకరికి విహారమయ్యింది.