వన్ నేషన్ వన్ ఎలక్షన్…అంటూ గత కోనేళ్ళుగా బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కార్య రూపం దాల్చలేదు. అయితే హ్యాట్రిక్ కొట్టి మూడో సారి కేంద్ర అధికార పగ్గాలు చేప్పట్టిన బీజేపీ ఈసారి ఎలా అయినా ఈ జమిలి ఎన్నికలు కార్యాచరణ పూర్తి చేయాలనీ పట్టుదలతో ఉంది.
ఇందులో భాగంగా నేడు కేంద్ర క్యాబినెట్ జమిలి ఎన్నికలకు ఆమెదం తెలిపింది. రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈ కమిటీ నివేదికను రాష్ట్రపతి ముర్ము కు అందచేసింది. రానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో ఈ బిల్లును చట్ట సభలలలో ప్రవేశ పెట్టి చట్టంగా రూపొందించడానికి బీజేపీ రంగం సిద్ధం చేస్తుంది.
ఈ బిల్లు చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను 100 రోజుల వ్యవధిలో అన్ని స్థాయిలలో ఎన్నికల తంతును పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియను ప్రతిపక్ష మైన కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతాం అంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నొక్కి వక్కాణిస్తున్నారు.
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానంతో ఎన్నికల ప్రక్రియ సులభతరం కావడంతో పాటుగా ఎన్నికల ఖర్చుని కూడా పరిమితం చేయవచ్చనే అభిప్రాయం వినపడుతుంది. తద్వారా ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించవచ్చని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అధికార టీడీపీ కూటమి ఎన్డీయే లో భాగస్వామి కాబట్టి జమిలి జై కొడుతోంది.
కానీ వైసీపీ ‘ఊ’ అంతుందా.? లేక ఉహు అంతుందా.?అనేది వేచి చూడాలి. అలాగే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షం లో ఉన్న బిఆర్ఎస్ ఇద్దరు బీజేపీ కి ప్రత్యర్థులే కావడంతో తెలంగాణలో జమిలికి జై కొట్టేదెవరో.?




