చంద్రబాబు సూపర్ లాజిక్… నిజమే కదా!

Will-2019-See-The-Return-of-Chandrababu-Naidu-Clout-at-the-Centerబీజేపీ హై కమాండ్ పై చంద్రబాబు నాయుడు విమర్శల హోరు పెంచారు. ఈరోజు అమిత్ షా కుమారుడి అవినీతి గురించి ప్రస్తావించిన సీఎం విజయ్‌ మాల్యాకు ఓ న్యాయం.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో న్యాయమా..? అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

బ్యాంకుల్లో రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, మరి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దుచేయలేదని ఆయన నిలదీశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయారని.. విజయసాయి పీఎంవోలో ఉంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

ఇద్దరూ ఆర్ధిక నేరస్థులేనని.. వారిమధ్య వ్యత్యాసం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఒకరకంగా చంద్రబాబు అడిగినది నిజమే కదా? మాల్యా మీద ఆరోపణలు కూడా న్యాయస్థానంలోనే ఉన్నాయి. మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి ఉంటది కదా!

ADVERTISEMENT
Latest Stories