ప్రధాని కావాలన్న దానిపై చంద్రబాబు కామెంట్!

chandrababuదేశానికి ప్రధానమంత్రిని కావాలన్న కోరిక తనకు లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను అందించిన ఆయన, ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి, అగ్రగామిగా నిలపాలన్నదే తన కోరికని తెలిపారు. విద్యార్థుల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిభను వెలికితీయాల్సి వుందని అభిప్రాయపడ్డ ఆయన, విదేశీ విద్యార్థులు నవ్యాంధ్రకు వచ్చి విద్యను అభ్యసించేలా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ అవుతుందని వివరించారు. మరో మూడు నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కాలేజీల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.

ADVERTISEMENT

అన్నీ తానే చేస్తే మీరేం చేస్తారంటూ ప్రశ్నించిన చంద్రబాబు ప్రజల కోసం తాను 24 గంటలూ కష్టపడుతుంటే మీరు ఇళ్లలో కుదరని తేల్చి చెప్పారు. రేషన్ దుకాణాల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు ఈ వాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ గూడవల్లి సీతారామస్వామి ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలిపేందుకు తాను నిరంతరం కష్టపడుతున్నానని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కల్పించుకుని తమకు రేషన్ షాపుల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్నీ తానే చేస్తే మీరేం చేస్తారని ప్రశ్నించారు. జనం తీరు చూస్తుంటే చివరికి వంట కూడా తననే చేయమనేలా ఉన్నారంటూ నవ్వులు పూయించారు.

ADVERTISEMENT
Latest Stories