ప్రళయాలతో ప్రయాణం..!

chandrababu-naidu-meets-flood-victims

ప్రకృతి ప్రకోపం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. ప్రకృతి ప్రళయాలను ఎవ్వరు ఆపలేరు కానీ ఆ ప్రళయం చేసిన విధ్వంసాన్ని ఎలా ఎదుర్కోకొంటారు అనేదే ఇక్కడ కీలక అంశం. తన 40 ఎళ్ల రాజకీయ అనుభవంలో ఇటివంటి ప్రళయాలతో ప్రయాణం చేసారు చంద్రబాబు.

తానూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ముందుకెళ్లారు బాబు. అందులో ముఖ్యంగా1997లో వచ్చిన హరికేన్ సైక్లోన్, 2014 వైజాగ్ లో వచ్చిన హుదూద్ తుఫాన్ చంద్రబాబు పాలనా దక్షతకు అద్దం పట్టాయి. పాలనా అనుభవంతో, వివిధ శాఖల మీద ఉన్న పట్టుతో యంత్రంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ADVERTISEMENT

ప్రకృతి ప్రకోపం చల్లారే వరకు, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఫీల్డ్ వర్క్ చేస్తూ, చేపిస్తూ బాధితులకు నేనున్నాను అనే భరోసా కల్పించారు. అలాగే నేడు ఏపీలో జరుగుతున్న వర్ష బీభత్సానికి, వరదలతో విజయవాడ అల్లాడుతోంది. గత 50 ఏళ్ళలో ఎన్నడూ చూడని, కనివిని ఎరుగని వరదలు విజయవాడని చుట్టుముట్టాయి.

దానికి తోడు ముడమేరు మహాగ్రరూపం దాల్చడం విజయవాడ వాసులకు మరో శాపంలా మారింది. ముఖ్యంగా సింగినగర్, వన్ టౌన్, పాయకరావుపేట, ఇంబ్రహీంపట్నం వంటి ప్రాంతాలలో వరద బీభత్సం తీవ్ర స్థాయిలో ఉండడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

బాధితులకు దైర్యం చెప్పడానికి, మీకు అండగా ప్రభుత్వం ఇక్కడే ఉంది అనే భరోసా కల్పించదానికి ప్రతి రెండు గంటలకొకసారి బాధిత ప్రాంతాలను సందర్శిస్తూ, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు, వారికీ అవసరమైన ఆహార సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ అర్ధరాత్రి 3 గంటల సమయంలో కూడా బాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు.

పరిస్థితులు పూర్తిగా చక్కబడి, సాధారణ వాతావరణం వచ్చే వరుకు నేను ఇక్కడే మీతో పాటే ఉంటాను అంటూ వరద బాధితులకు హామీ ఇచ్చారు. వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సాయం కింద 112,107 హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవాలయంలో వరద బాధితుల సహాయార్థం భోజన సదుపాయాలు సిద్ధం చేయడానికి తగిన ఆదేశాలు జారీ చేసారు.

ఇలా బాబు ప్రళయాలతో ప్రయాణం చేస్తూ బాధితులకు అండగా, యంత్రాగానికి నాయకుడిగా ఏడు పదుల యవస్సులోను తానూ పరుగులు పెడుతూ అధికారులను సైతం పరుగులు పెట్టిస్తున్నారు. నిద్రాహారాలు సైతం పక్కన పెట్టి రాజీ లేని పోరాటం చేస్తూ నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటూ సమీక్షలు, పర్యవేక్షణలతో వింటేజ్ బాబుని గుర్తు చేస్తున్నారు సీఎం.

ADVERTISEMENT
Latest Stories