వీళ్ళు ‘గేరు’ మార్చితే కానీ వాళ్ళ ‘గీర’ తగ్గదా..?

Chandrababu Naidu Pawan Kalyan YS Jagan Roja

పదవి పోయినా ‘వైసీపీ’కి పొగరు పోలేదు, అధికారం దూరమైనా ‘జగన్’ కు అహంకారం తగ్గలేదు, అలాగే కంటికి కనిపించే వాస్తవాలను కూడా కల్పితాలుగా చిత్రీకరించే ‘సాక్షి’ కథనాలు మారలేదు. ప్రభుత్వంలో ఉన్నది కూటమి పార్టీలైన పెత్తనం మాత్రం తమదే అన్న రీతిగా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు.

ADVERTISEMENT

అవే తప్పుడు ప్రచారాలు, అవే నీలి రాతలు. టీడీపీ, జనసేన ప్రతిపక్షములో ఉన్నప్పుడే వైసీపీ మీద దూకుడుగా ముందుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చేతిలో అధికారం ఉన్నా వైసీపీ నేతల నోటికి కళ్లెం వేయలేకపోతున్నారు. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద అలుపెరుగని యుద్ధం చేసి చావుదెబ్బ కొట్టిన బాబు, పవన్ లు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైసీపీ ని పవన్, బాబు లు కట్టడి చేయలేకపోతున్నారా అంటే ఇరు పార్టీల కార్యకర్తల నుండి అవుననే సమాధానమే వినపడుతుంది. అధికారం బాధ్యతను ఇచ్చింది కదా అని భరించడం కూటమి ప్రభుత్వం చేతకాని తనమే అవుతుంది. అలాగే బరితెంగించిన రాజకీయాలు చేస్తున్న వారికీ బుద్ది చెప్పాలంటే బాబు కాస్త కఠినంగానే వ్యవహరించాలి.

వైసీపీ నీచ రాజకీయాలు ఎదిరించి నిలబడాలి అంటే వీళ్ళు (బాబు, పవన్) ‘గేరు’ మార్చలసిందే. అప్పుడే వాళ్ళ ( జగన్ అండ్ కో) ‘గీర’ తగ్గుతుంది అన్న వాదన ప్రజలలో బలంగా వినపడుతుంది. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు ఉప ముఖ్యమంత్రి పవన్, హోమ్ మంత్రి అనిత, ఐటీ మంత్రి లోకేష్, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ బాధితులకు అండగా ఉంటున్నారు.

అయినా కూటమి ప్రభుత్వం విపత్తు ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యింది అంటూ ఒకరు, రాష్ట్రంలో వరదలొస్తే మంత్రులు విహార యాత్రలకు వెళ్లారు అంటూ మరొకరు కూటమి నేతల పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి వరద ముంపు ప్రాంతమంటు తప్పుడు కథనాలు వండి వడ్డిస్తున్నారు.

తమ రాజకీయ మైలేజ్ కోసం వందల మంది విద్యార్థినిల జీవితాల పై అసత్య ప్రచారాలు చేస్తూ వారి భవిష్యత్తును చీకటి మయం చేయడానికి కూడా వెనకాడని నైజం వైసీపీ సొంతం అనేలా గుడ్లవల్లేరు సంఘటనతో రుజువయ్యింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏరియల్ సర్వేలతో సరిపెట్టిన జగన్ ఇప్పుడు మాత్రం బాబు చేసేది సరిపోదంటూ కాసేపు, బాబు మరి అతి చేస్తున్నాడు అంటూ మరికాసేపు పొంతన లేని సమాధానాలు వినిపిస్తున్నారు.

బాబు పవన్ ల అలసత్వం వైసీపీకి బలంగా మారుతుందనే సత్యాన్ని బాబు, పవన్ లు గ్రహించలేకపోతున్నారా.? తామేం చేసిన కూటమి ప్రభుత్వం తమ మీద చర్యలు తీసుకోలేక పోతుంది అనే భావనలోకి వైసీపీ నేతలు వచ్చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒకపక్క నుంచి పవన్ మరో పక్క నుంచి బాబు వీరిద్దరికి మద్దతుగా లోకేష్ వైసీపీ మీద విరుచుకు పడడంతో జగన్ కాస్త వెనకడుగు వేసారు. అలాగే ఆలోచనలో పడి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లారు.

ఎన్నికల ముందు కూటమి పార్టీలను చిత్తూ చేయడానికి జగన్ చేసిన ‘గులకరాయి’ రాజకీయాన్నికూడా బలంగా ఎదుర్కొని ప్రజలలో తిప్పికొట్టగలిగారు పవన్, బాబు. అలాగే హూ కిల్డ్ బాబాయ్ అంటూ అబ్బాయిని ప్రశ్నించిన వైనం, చెల్లికి, తల్లికి న్యాయం చెయ్యలేని వాడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా అంటూ వైసీపీని వేలెత్తి చూపిన తీరు, నేరస్తులు రాజ్యమేలితే రాష్ట్రం శూన్యమే అంటూ చెప్పిన విధానం ప్రజలలోకి బలంగా వెళ్ళింది.

దాని ఫలితమే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా వైసీపీని 11 తో కట్టడి చెయ్యగలిగింది. వీళ్ళు (కూటమి నేతలు) స్పీడ్ పెంచితే బూతులతో రెచ్చిపోయే వాళ్ళు (వైసీపీ నేతలు) కూడా కలుగులో దాక్కున్న ఎలక పిల్ల మాదిరి సైలెన్ట్ అవుతారు. లేకపోతే భవిష్యత్ లో వైసీపీని ఎదుర్కోవడం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది.

చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెత మాదిరి వైసీపీ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించాలి. అలాకాకుండా 11 సీట్లేగా అని వైసీపీని తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యం వహిస్తే అది అనకొండగా మారి కూటమి ప్రభుత్వం తో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను కూడా మింగేయగలదు అని గ్రహించాలి.

ADVERTISEMENT
Latest Stories