అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్తపన్ను రద్దు చేయబడింది అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ రాష్ట్రంలోకి చెత్తపన్ను విధానాన్ని అమలు చేసి చెత్త ముఖ్యమంత్రిగా పేరు గడించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ చెత్త పన్ను రద్దు చేస్తాం అంటూ ఇటు బాబు, అటు పవన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గాంధీ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి బాబు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు, చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
మచిలీపట్టణం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న బాబు 2029 కల్లా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఏపీ గా మార్చాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్నులు వేసి ప్రజలను పీడించిందని, మా ప్రభుత్వం చెత్త పన్ను కాదు స్వచ్ఛ ఏపీ కోసం కట్టుబడి ఉందంటూ ప్రకటించి ఈ మేరకు ఇటు ప్రజలు అటు మున్సిపాలిటీ సిబ్బందికి స్వచ్ఛ ఏపీ కోసం తమవంతు బాధ్యతగా వ్యవహరించాలంటూ పిలుపు నిచ్చారు.
అయితే నాడు 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దానికి ఇప్పటి దేశం మొత్తం ఆయన పిలుపుకి కట్టుబడి ప్రధాని అడుగులో అడుగులు వేస్తూ స్వచ్ఛ భారత్ కోసం పని చేస్తుందని వెల్లడించారు.
అలాగే గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా రోడ్ల పై దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిని ఒక ఏడాదిలోపే శుభ్రం చేసి క్లీన్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దాలంటూ పురపాలక శాఖ మంత్రి కి,అధికారులకు ఆదేశాలు జారీ చేసారు బాబు. అలాగే ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములుగా చేరి స్వచ్ఛ సేవకులుగా మారాలంటూ పిలుపునిచ్చారు.
ఏపీలో చెత్త పన్ను రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు#ChandrababuNaidu pic.twitter.com/5CipuYIMOs
— M9 NEWS (@M9News_) October 2, 2024




