చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. సమైఖ్య రాష్ట్రంలో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు అనుభవం ఉంది. ఇప్పుడు 4వ సారి మరో 5 ఏళ్ళు కూడా కలుపుకుంటే దాదాపు రెండు దశాబ్ధాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా నిలుస్తారు.
ఆయన 40 ఏళ్ళ సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు, ఘోర అవమానాలు, అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ ఓటములు, అవమానాల అగ్నిపరీక్షల నుంచే ఆయన అనుభవ పాఠాలను నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ ఉన్నత స్థాయికి చేరుకుంటూనే ఉన్నారు.
Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!
ఈ దేశంలోనే గొప్ప మేధావినని విర్రవీగిన కేసీఆర్, చంద్రబాబు నాయుడుని తెలంగాణ నుంచి తరిమేశానని గొప్పలు చెప్పుకునేవారు. కానీ చంద్రబాబు నాయుడు ఏనాడూ కేసీఆర్‌ని పల్లెత్తు మాట అనకుండా తెలివిగా పావులు కదిపి, ఇప్పుడు తెలంగాణలోనే కేసీఆర్‌కు స్థానం లేకుండా చేశారు.
కేసీఆర్ తల మీద ఇప్పుడు అనేక కేసులు కత్తుల్లా వ్రేలాడుతుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టి రాజకీయాలలో కేసీఆర్ తనకు సాటికాదని నిరూపించుకున్నారు.
Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?
ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించారో, ఎంతగా వేధించారో అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏ మాత్రం నిబ్బరం కోల్పోకుండా పార్టీని కాపాడుకుంటూ జగన్‌ని కూడా ఓడించి మూల కూర్చోబెట్టారు. ఈవిదంగా వేర్వేరు రాష్ట్రాలలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యపడింది.
జగన్, కేసీఆర్‌లాగా చంద్రబాబు నాయుడు ప్రత్యర్ధులపై రాజకీయ కక్షలు తీర్చుకోవాలనుకోరు. అయినా జగన్ ఒకవేళ కేసులకు భయపడి వేరే రాష్ట్రాలకు పారిపోవాలనుకున్నా, కాంగ్రెస్, బీజేపీలతో చంద్రబాబు నాయుడుకున్న సత్సంబంధాల కారణంగా దేశంలో ఎక్కడా జగన్‌కు నిలువ నీడ దొరకదు.
Also Read – కేసీఆర్, కేటీఆర్ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?
చంద్రబాబు నాయుడు జగన్‌లాగా ప్రతీకారం తీర్చుకునే రకం కాకపోవడం, ప్రస్తుతం ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దడంపైనే ఎక్కువగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి, వైసీపి నేతల అదృష్టమనే చెప్పాలి.
ఈ వయసులో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే గొప్ప విషయం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి ఉద్యోగాలు కల్పించడం, అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పూర్తిచేయడం, ఎన్నికల హామీలను అమలుచేయడం వంటి చాలా బాధ్యతలు ఆయన భుజాలపై ఉన్నాయి. కనుక 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి మరోసారి తన సమర్ధతని నిరూపించుకునే అవకాశం లభించిందని భావించవచ్చు.