
సుమారు నెల రోజుల విరామం తరువాత సెప్టెంబర్ 19వ తేదీన టీం ఇండియా చెన్నై చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను ఆరంభించింది. టాస్ ఒడి తొలుత బాటింగ్ చేయాల్సి వచ్చిన భారత్ కు ఆదిలోనే హంసపాదంలా ముఖ్యమైన టాప్ ఆర్డర్ తొలి గంటలోనే కుప్పకూలింది.
Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే
ఆ స్థాయి నుండి ఈ రేంజ్ కం బ్యాక్ చేస్తారని ఎవరు ఊహించలేదు. రిషబ్ పంత్ ఇంటెంట్ బ్యాటింగ్ పునాదిగా మార్చుకుని, ‘రవి’ అశ్విన్-జడేజాల జోడీ మ్యాచ్ ను భారత్ చేతిలోకి తెచ్చిపెట్టారు. బౌలింగ్ లో సైతం బంగ్లా జట్టును కేవలం 149 పరుగులకే ఆల్ అవుట్ చేసారు.
రెండవ ఇన్నింగ్స్ లో పంత్ – గిల్ ల భాగస్వామ్యం మ్యాచ్ ను భారత్ గుప్పిట్లోకి తెచ్చేసింది. ఇక బంగ్లా జట్టు 515 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగగా, డే-4 మొదటి సెషన్ కే బంగ్లాను ఆల్ అవుట్ చేసి టీం ఇండియా మ్యాచ్ ను వశం చేసుకుంది. మ్యాచ్ కే హైలైట్ గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.
Also Read – జగన్ అనుకున్నట్టే బట్టలు ఊడతీస్తున్నారుగా…
ఈ మ్యాచ్ లో గెలుపు తో టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని ఒడిసి పట్టుకుని, ఫైనల్ బెర్త్ కు మరోసారి హాట్ ఫేవరేట్ గా టీం ఇండియా నిలిచింది. 2021 మార్చ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ కూడా చెపాక్ లో జరగగా, ఆ మ్యాచ్ లో కూడా అశ్విన్ సెంచరీ చేసారు, 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. అదే చరిత్ర మరోసారి బంగ్లాతో కూడా పునరావృతం కావడం విశేషం.
ఈ మ్యాచ్ లో గెలుపుతో భారత్ అంతర్జాతీయ టెస్ట్ ల లో 50 పర్సెంట్ విన్ రేషియో వచ్చింది. టెస్ట్ మ్యాచ్ లు ఆడటం మొదలు పెట్టి 92 ఏళ్ళు కాగా, భారత్ కు ఎప్పుడూ ఇలా 50 పర్సెంట్ గెలుపు శాతం లేదు. ఇలా భారత జట్టు తమ సొంత గ్రౌండ్ లో ఒక టెస్ట్ సిరీస్ ను ఒడి 12 ఏళ్ళు గడిచింది.
Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
ఈ 12 సంవత్సరాలలో భారత జట్టు 16 టెస్ట్ సిరీస్ ల ను సొంత వేదికలో ఆడారు. అందులో, ఒక్క సిరీస్ కూడా ఓటమి పాలు కాకుండా ఉండటం కేవలం భారత్ కే సొంతం. స్వదేశీ పిచ్ లపై టీం ఇండియాను నిలువరించడం అసాధ్యం అన్న రీతిలో తమ విజయ ప్రస్థానాన్ని టీం ఇండియా నిరాటంకంగా కొనసాగిస్తోంది.