ఇది… మెగా క్లిక్ గురూ..!

Chiranjeevi and Raadhika Sarathkumar China Tour‘ఖైదీ నంబర్ 150’ సినిమా ద్వారా ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ హంగామా చేసిన మెగాస్టార్ చిరంజీవి, త్వరలో ‘ఊయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపున ఓ సమ్మర్ ట్రిప్ లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి చైనా వెళ్ళిన విషయం, ఇటీవల దాసరి మరణం ద్వారా తెలిసింది. తాజాగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి.

ADVERTISEMENT

సతీమణి సురేఖతో పాటు ఒకప్పటి సినీ హీరోయిన్ రాధిక అండ్ కో కూడా భాగస్వామ్యులు అయిన ఈ ట్రిప్ బాగా జరిగిందంటూ… రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేసుకుంది. తన జీవితంలో మెమరబుల్ జ్ఞాపకాలను మిగిల్చిందంటూ రాధిక పోస్ట్ చేసిన ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి క్లిక్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ సెల్ఫీ ఫోటో వైరల్ అయ్యింది. ఎంతైనా మెగాస్టార్ క్లిక్ కదా… మెమరబుల్ కాకుండా ఎలా ఉంటుంది..?!

ADVERTISEMENT
Latest Stories