నిన్ననే చెపాక్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను బెంగళూరు జట్టు ఏకంగా 50 పరుగుల వ్యత్యాసం తో వారి సొంత గడ్డ మీద మట్టి కరిపించారు. అయితే ఈ ఓటమి లో సి.ఎస్.కె జట్టు ఇలా చేయకుంటే బాగుండేదేమో అన్న ఆలోచనలు మ్యాచ్ వీక్షించిన CSK అభిమానులను వెంటాడుతున్నాయి.
వాటన్నింటిలోను అత్యధిక ప్రాముఖ్యత వచ్చింది మాత్రం, ఎం.ఎస్.ధోని ఇన్ ఎట్ 9 లో వచ్చేందకు గల కారణాలేంటి..? ఇంకా ధోని బ్యాటింగ్ కు రావాల్సి ఉండగా, ధోని కింది స్థానములో బ్యాటింగ్ కు రావాల్సిన అశ్విన్ ను 14 వ ఓవర్ లో పంపేందుకు జట్టు యాజమాన్యం మరియు కెప్టెన్ ఋతురాజ్ తీసుకున్న ప్రణాళికలేంటి..?
మొదటిలో ఇన్ ఎట్ 5 లో బ్యాటింగ్ కు వచ్చే ఎం.ఎస్.డీ, తాను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన తరువాత నుండి ఇన్ ఎట్ 6 లేదా 7 లో బ్యాటింగ్ కు వచ్చేవారు. ఇక, ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలు చేసినప్పటి నుండి, దాదాపుగా ఇన్ ఎట్ 8 లో నే బ్యాటింగ్ కు వస్తున్నారు ధోని. కానీ, నిన్నటి మ్యాచ్ లో ధోని ఏకంగా 9 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగారు.
ఈ సంఘటన కేవలం చెన్నై అభిమానులనే కాదు, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆలోచింప చేసింది. ఈసారి, చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం గందర గోళం గానే ఉంది. ఓపెనింగ్ చేయాల్సిన రుతురాజ్ వన్ డౌన్ లో మైదానంలోకి అడుగుపెట్టారు. 2 లేదా 3 వికెట్ల పతనానికి బ్యాటింగ్ కు వచ్చే శివమ్ దూబే నిన్న ఏకంగా 4 వికెట్లు పడ్డాక క్రీజ్ లో కి ఎంట్రీ ఇచ్చాడు.
లోయర్-మిడిల్ ఆర్డర్ లో వచ్చే కరన్ ను ఇన్ ఎట్ 5 గా పంపారు. ఇలా, ఒకటి రెండు కాదు, నిన్న చెన్నై జట్టు తమ బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన ప్రతి మార్పు తప్పు గా మారి CSK ను విజయం నుండి ఒక్కో అడుగు వెనక్కి తీసుకెళ్లింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఆ బ్యాటర్ల నుండి కనీస ఇంటెంట్ కూడా లేకుండా పోయింది. వచ్చిన ప్రతి బ్యాటర్ డాట్ బాల్స్ ఆడేసి పెవిలియన్ కు వెళ్లిపోయారు.
ఇలాగే కనుక చెన్నై జట్టు అనవసర ప్రయోగాలు చేస్తే మరల చేతులు కాల్చుకోవడం తప్పదేమో అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఏది ఏమైనా 6123 రోజుల తరువాత చెన్నై టీం ను వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడించిన ఘనత దక్కించుకున్నారు RCB. అలాగే ఇప్పటివరకు RCB ఆడిన రెండు మ్యాచ్ లలోను ప్రత్యర్థి జట్టుని వారి సొంత గ్రౌండ్ లో ఓడించి ఆ జట్టు అభిమానులకు మంచి జోష్ ని పంచున్నారు RCB ప్లేయర్స్.




