‘వర్మ’కు షాక్ ఇచ్చిన ‘దర్శకరత్న’

dasari-shocks-rgvసంచలమైన కధలను ఎంచుకుంటూ మీడియా వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా హల్చల్ చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఇటీవల “శశికళ” పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జయలలిత లేకుండా శశికళ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరినీ క్రోడీకరిస్తూ వర్మ ఏ విధంగా తెరకేక్కిస్తారో అన్న ఆసక్తి ‘అమ్మ’ అభిమానుల్లో నెలకొంది. అయితే వర్మ ‘శశికళ’ను ముస్తాబు చేసే లోపునే ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు జయలలిత బయోపిక్ ను ముగించేస్తానని ప్రకటన చేసారు.

కొత్త నటీనటులతో జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఓ సినిమాను ప్రకటించారు దాసరి. ముఖ్యంగా జయలలిత జీవితం చివరి రోజుల్లో సంచలనాత్మకంగా నిలిచిన అపోలో హాస్పిటల్ ఉదంతం కూడా ఇందులో ఉంటుందని దాసరి స్పష్టం చేసారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ ముగించి, ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తానని దాసరి ప్రకటించడం విశేషం. దీంతో శశికళ కంటే ముందే జయలలిత సినిమా విడుదల కానుందన్న మాట. వీరిద్దరిలో ఎవరి జీవిత చరిత్ర తెరకెక్కినా, మరొకరు లేకుండా సాధ్యం కాదన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories