ఆయన పాస్టర్.. కనుక శవ రాజకీయాలు తప్పవు

pastor-praveen-pagadala-death

సికింద్రాబాద్‌లో తిరుమలగిరి చర్చిలో పాస్టర్‌గా చేస్తున్న ప్రవీణ్ పగడాల అక్కడి నుంచి బుల్లెట్ మోటార్ సైకిల్‌పై రాజమండ్రి వస్తుండగా శివారులో కొంతమూరు వద్ద ప్రమాదవశాత్తు ప్రధాన రహదారిపై నుంచి పక్కనే పల్లంగా ఉన్న ప్రాంతానికి జారిపోయారు.

ఈ ప్రమాదంలో బుల్లెట్ వాహనం ఆయన మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరుడంతో మర్నాడు ఉదయం వరకు ఎవరూ ఆయనని చూడకపోవడంతో ఘటనాస్థలంలోనే చనిపోయారు.

ADVERTISEMENT

మంగళవారం ఉదయం ఈ సమాచారం అండగానే రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ పోలీసులను, అంబులెన్సు వెంటబెట్టుకొని అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే మరణించి ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసుకొని పాస్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఒకవేళ చనిపోయిన వ్యక్తి పాస్టర్ కాకపోయి ఉంటే పత్రికలో ఈ వార్తని చూసినవారు పెద్దగా స్పందించేవారు కారని అందరికీ తెలుసు. కేవలం అదో రోడ్ ప్రమాదమని భావించేవారు. కానీ చనిపోయింది పాస్టర్ కనుక ముందుగా వైసీపీ తర్వాత కేఏ పాల్ ఇది ప్రమాదం కాదు హత్య అని వాదించడం మొదలుపెట్టారు.

ఈ కేసులో మత రాజకీయాలు జరుగుతుండటంతో సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే డీజీపీకి ఫోన్ చేసి ఇది ప్రమాదమా, హత్యా కనిపెట్టాలని ఆదేశించారు.

అప్పటికే తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ మార్గంలో గల సుమారు 5 కిమీ దూరం వరకు గల అన్ని సీసీ కెమెరాల రికార్డింగ్స్ పరిశీలించారు. ఎక్కడా అనుమానస్పదంగా ఏదీ కనిపించకపోవడంతో రోడ్ ప్రమాదమనే భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా పోలీసుల చేతికి వస్తే ఇది ప్రమాదమా, హత్యా అనే విషయం తెలిపోతుంది.

అయితే ఈలోగా కేఏ పాల్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తాను ఢిల్లీ నుంచి ఇప్పుడు విజయవాడ వచ్చానని, రాజమండ్రి వస్తే రచ్చరచ్చ అయిపోతుందని, కనుక సిఎం చంద్రబాబు నాయుడుతో సహా పోలీస్ ఉన్నతాధికారులకు, దర్యాప్తు అధికారులకు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ కేసుని క్షుణ్ణంగా, పారదర్శకంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని అభ్యర్ధిస్తే తప్పు లేదు. కానీ ఆయన మాటలు వింటే ‘ఇది హత్య అని పోలీసులు నిర్ధారించాలని’ కోరుకుంటున్నట్లు ఉంది తప్ప ఇది హత్యా, ప్రమాదమా తెలుసుకోమని కోరిన్నట్లు లేదు. ఒకవేళ తాను కోరుకున్నట్లు పోలీసులు నిర్ధారించకపోతే ఈ ప్రభుత్వం భరతం పడతానని కేఏ పాల్ హెచ్చరించడాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories