ఈ ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలం లో ఇద్దరు భారత యువ క్రికెటర్లు భారతీయులందరిని మరియు ప్రపంచాన్నే అవాక్కు పరిచేలా దాదాపు 27 కోట్ల వేలాన్ని పలికారు. ఆ ఇద్దరు మరెవరో కాదు శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్.
వేలం ప్రారంభానికి ముందే వీరిద్దరి ధరలపై భారీ అంచనాలే ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ధరను అందుకుంటారని ఎవరు ఊహించలేదు. అయితే ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభం అయ్యి 10 రోజులు అవ్వగా, లక్నో జట్టు 2 మ్యాచ్లు ఆడగా, రిషబ్ పంత్ వ్యక్తిగతంగా అంత గొప్ప ఆటతీరును కనబరచటంలో విఫలమయ్యాడు.
మొదటి మ్యాచ్ లో డక్అవుట్ గా, రెండవ మ్యాచ్ లో బాల్-టు-బాల్ ఇన్నింగ్స్ మాత్రమే ఆడగలిగాడు. వ్యక్తిగతంగా పంత్ విఫలమయినప్పటికీ, కెప్టెన్ గా తన జట్టు కు బోణీ కొట్టించాడు. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ పై లక్నో గెలుపు దాదాపు అనివార్యం అనుకున్న సమయంలో పంత్ చేసిన చిన్న చిన్న తప్పులు ఆ జట్టును ఓటమి పాలు చేసాయి.
సన్-రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో తన తప్పులను గ్రహించి, బౌలర్ ల ను అద్భుతంగా ఉపయోగించుకుని, ఆ జట్టు గెలుపు ఖాతా తెరిచాడు రిషబ్ పంత్. మరో పక్క శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ చేస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడినప్పటికీ, ఆ ఒక్క మ్యాచ్ లో తాము చూపించిన ఆట తీరు, ఈ సీజన్ వారి వేట ఎలా ఉండనుందో అని ఒక క్లారిటీ ఇచ్చేసారు.
జట్టులోని ప్రతి ఆటగాడు కేవలం జట్టు ఎదుగుదల కోసమే చూస్తున్నాడు గాని, వ్యక్తిగత ఆడంబరాలు లెక్కించడంలేదు అనేలా మైదానంలో తలపడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఆ జట్టు కెప్టెన్ అయ్యర్ మరియు ఫినిషర్ శశాంక్ సింగ్. అయ్యర్ తన సెంచరీ ను 3 పరుగులతో వదులుకుంటే, సింగ్ తన 50 ను కేవలం 6 పరుగులతో వదులుకున్నాడు.
ఇలా అయ్యర్ ఇప్పటికే తాను తీసుకుంటున్న ఆ 26 కోట్ల పారితోషకాన్ని తాను అర్హుడే అనేటట్లు బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ లో చూపించాడు. మరి, ఇవాళ పంత్ నుండి కూడా ఆ రేంజ్ ఆటను చూడబోతున్నామా..?
ఈరోజు లక్నో లో జరగనున్న LSG, పంజాబ్ జట్ల మధ్య జరగబోతున్న ఈ ఉత్కంఠ పోరులో ఈ ఇద్దరు హై ప్రైస్ ఆటగాళ్ల మధ్య హై లెవెల్ బ్యాటిల్ తప్పదు అంటున్నారు ఐపీఎల్ ప్రేమికులు. మరి ఎవరు వారి హై ప్రైస్ ధరకు తగ్గ హై పెరఫార్మెన్సు తో ప్రత్యర్థి జట్టు పై విరుచుకుపడతారో మరికొన్ని గంటలలో తేలిపోతుంది.




