aravind-kejriwal-kavitha-kalvakuntla

లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ, సీబీఐ అధికారులు దాదాపు మూడేళ్ళుగా దేశమంతా తిరిగి సాక్ష్యాధారాలు సేకరించి, అనేక వందల మందిని ప్రశ్నించి, కోర్టులలో డజన్ల కొద్దీ ఛార్జ్ షీట్లు వేసి, న్యాయ పోరాటాలు, బెయిల్‌-పోరాటాలు ఎన్నో చేశారు. వాటన్నిటికీ బహుశః వంద కోట్లు పైనే ఖర్చు అయ్యుంటుంది.

Also Read – ప్యాలస్‌లో ప్రతిపక్షం… సోషల్ మీడియాలో రాజకీయాలు!

ఈ కేసులో ‘వంద కోట్లు’ అవినీతిని బయటపెట్టడానికి వంద కోట్లు ఖర్చు చేసినా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు. కల్వకుంట్ల కవిత న్యాయవాది ఈవిషయం సుప్రీంకోర్టులోనే కుండ బద్దలు కొట్టారు.

తర్వాత ఏం జరిగింది అంటే, బెయిల్‌పై విడుదలై వచ్చిన కల్వకుంట్ల కవిత, తాజాగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ “న్యాయం ధర్మం గెలిచాయని” తేల్చి చెప్పేశారు!

Also Read – విశాఖ అభివృద్ధిలో మరో అడుగు టీసీఎస్!

అంటే కేంద్ర ప్రభుత్వం వారిపై రాజకీయ కక్షతో లేని కేసును సృష్టించి వేధించిందనే కేసీఆర్‌, కవిత వాదనలు నిజమని భావించాల్సి ఉంటుంది.

అంతేకాదు… ఈడీ, సీబీఐ అధికారులు మూడేళ్ళు కష్టపడి కొండని తవ్వినా కనీసం ఎలుకని పట్టుకోలేకపోయారు. అంతేకాదు… ఆ కొండని తవ్వడం కోసం వారి శ్రమ, చేసిన ఖర్చు, ఈ కేసు విచారణ, బెయిల్‌ పిటిషన్ల విచారణ కొరకు అమూల్యమైన సుప్రీంకోర్టు, హైకోర్టుల సమయం అన్ని వృధా అయిన్నట్లే భావించవచ్చు.

Also Read – కిల్ బిల్ పాండ్య’..!

ఈ కేసులో ప్రధాన సూత్రధారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్వింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, అరుణ్ పిళ్లై తదితరులు అందరూ ఒకరి తర్వాత ఒకరు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. కనుక ఇక్కడితో ఈ కేసు ముగిసిపోయిన్నట్లే.

ఒకవేళ హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతున్నా అవి ఆయా కేసులని వాదించే న్యాయవాదులకు ‘ఇన్‌కమ్ గ్యారెంటీ స్కీమ్’ వంటివే తప్ప వాటితో ఒరిగేదేమీ ఉండదని జగన్‌ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసు విచారణలు గమనిస్తే అర్దమవుతుంది.




ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితతో సహా అందరూ “కడిగిన ఆణిముత్యాల్లా బయట పడ్డారు”… న్యాయం ధర్మం గెలిచిందని వారు చెపుతున్నారు. కనుక అందరం సంతోషించాల్సిందే. వెయ్యెకరాల మాగాణీ పోతే పోయింది కానీ లా మొత్తం క్షుణ్ణంగా తెలిసిందన్నాడట వెనకటికి ఒకడు. అంటే ఇదేనేమో?