
“నాకూ ‘ఒక్క ఛాన్స్’ ఇమ్మనమని’ జగన్ పదేపదే ప్రజలను బ్రతిమాలుకోవడంతో ఆయన కూడా తన తండ్రిలాగే చక్కటి పాలన అందిస్తాడనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలు, ఆయన సమర్ధత తెలియకపోయినా, అక్రమాస్తుల కేసులలో 16 నెలలు జైల్లో ఉన్నారనే విషయం తెలిసి ఉన్నా పట్టించుకోకుండా అధికారం కట్టబెట్టారు.
Also Read – వైసీపీ చరిత్ర బయటవారే చెప్పాలా… వద్దు!
కానీ నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపికైన అతిశీ మాత్రం ఆవిదంగా ‘ఒక్క ఛాన్స్’ ఇమ్మనమని ఎవరినీ అడుక్కోలేదు. తన సమర్ధత, తెలివితేటలు, చురుకుదనం, ప్రతిభాపాటవాలతో ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలలు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నేడు తన పదవికి రాజీనామా చేస్తున్నారు.
Also Read – డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్.. మరోసారి డేంజర్ బెల్
మరొకరైతే ఇలాంటి ఆలోచన కూడా చేసేవారు కారు. ఒకవేళ చేసినా ఆ కుర్చీలో తన భార్యనో, కొడుకునో కూర్చోబెట్టేవారు.
కానీ అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పార్టీ రూప కల్పన దశ మొదలు తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో అడుగడుగునా తనకు బాసటగా నిలిచిన అతీశీని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించగా, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఆమెకు మద్దతు తెలిపి తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు.
Also Read – విజయశాంతి కోపం.. మరి సగటు ప్రేక్షకుడు?
అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖ, రోడ్లు భవనాల శాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు మరో 14 ప్రభుత్వ విభాగాలను అతిశీ అత్యంత సమర్ధంగా నిర్వహిస్తున్నారు.
అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఆరు నెలలు జైల్లో ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ ప్రజలను ముఖాముఖీ కలిసి మాట్లాడుతూ తమ పార్టీ, ప్రభుత్వం పట్ల వారికి అపోహలు, అపనమ్మకం ఏర్పడకుండా కాపాడుకున్నారు. నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, అర్వింద్ కేజ్రీవాల్ గురించి బీజేపీ నేతల విమర్శలను ధీటుగా తిప్పి కొడుతుండేవారు.
ఈ కారణంగా ఆమెకు మరింత జనాధరణ పెరిగింది కూడా. కనుక అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతతో సహా పార్టీలో కొందరు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ, అతీశీనే ముఖ్యమంత్రి పదవికి సమర్ధురాలుగా భావించారు.
మధ్యతగరతికి చెందిన అతిశీ ఉన్నత విద్యావంతురాలు, పలు శాఖల మంత్రి అయినప్పటికీ ఏమాత్రం దర్పం, అహంభావం ప్రదర్శించకుండా సామాన్య ప్రజలతో మమేకం అవుతుంటారు. పార్టీలో ప్రతీ కార్యకర్తని పేరు పెట్టి పిలిచే అంత చనువుంది. కనుక ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలుగా తగిన వ్యక్తి అని అతీశీ నిరూపించుకొని ఆ పదవి చేపట్టబోతున్నారు తప్ప జగన్‌లాగ ‘ఒక్క ఛాన్స్’తో కాదు.