
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పంటసాయం అందించేందుకు రైతుబంధు పధకం ప్రవేశపెట్టారు. ఏకరాకు ఏడాదికి రూ.5000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10,000 అందించేవారు. అయితే ఆ పధకంతో అర్హులైన నిరుపేద రైతులు అందుకున్న సొమ్ము కంటే, బిఆర్ఎస్ పార్టీ నేతలకు, బడా భూస్వాములకు వందల రెట్లు ఎక్కువ సొమ్ము కట్టబెట్టింది.
Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!
ఆ సొమ్ము అవసరం లేని వారు వెనక్కు తిరిగి ఇవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కానీ అలా ఎంత సొమ్ము ప్రభుత్వానికి తిరిగి వచ్చిందో ఏనాడూ లెక్కలు చెప్పలేదు. కానీ ఆ సొమ్ము పొందినవారు కేసీఆర్‌ని ప్రసన్నం చేసుకునేందుకు దానిని బిఆర్ఎస్ పార్టీకి సమర్పించుకుంటారనేది బహిరంగ రహస్యం. అందుకే రైతుబంధు దుర్వినియోగం అవుతోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని 5 ఎకరాల రైతులకు పరిమితం చేసింది.
అయితే వందల ఎకరాలున్న భూస్వాములకు, సొంత పార్టీ నేతలకు చాలా ఉదారంగా రైతుబంధు చెల్లించిన కేసీఆర్, అది అత్యంత అవసరమైన కౌలు రైతులకు చెల్లించడానికి నిర్మొహమాటంగా నిరాకరించారు. దాని వలన న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయనే సాకు చూపేవారు.
Also Read – సమంతకు గుడి కట్టిన అభిమానం
ఒకవేళ కేసీఆర్ చెప్పిన్నట్లు కౌలు రైతులకు రైతుబంధు ఇస్తే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయనుకుంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉత్పన్నం కావాలి.
కానీ 2014 నుంచి 2019వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ. 26.77 లక్షల మంది కౌలురైతులకు ‘కౌలు కార్డులు’ ఇచ్చి వారికి రూ.9,681 కోట్లు పంట రుణాలు అందించింది.
Also Read – అభిమానుల కలల సీజన్ ఇదేనా..?
చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ప్రతీ పనిని తిరస్కరించిన జగన్ ప్రభుత్వం కూడా ‘కౌలు కార్డులు’ విధానం కొనసాగిస్తూ 20192024 మందు 10.65 లక్షల మందికి ‘కౌలు కార్డులు’ ఇచ్చింది.
అంటే వ్యవసాయ రంగంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలబడటం చాలా అవసరమని, దాని వలన ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావని నిరూపితమైంది.
కేసీఆర్ రైతులకు మేలు చేస్తున్నామనే పేరుతో రైతుబంధుని సొంత, పార్టీ, ప్రభుత్వ ప్రచారానికి ఉపయోగించుకోవడమే కాక ఆ సొమ్ముని దుర్వినియోగం చేశారని, ప్రభుత్వంపై ఆర్ధికభారం పెంచారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు నేటికీ కౌలు రైతులకు మేలు చేస్తూనే ఉన్నారు.
నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘కౌలు కార్డులు’పై చర్చించి మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కౌలు రైతులలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఎక్కువగా ఉన్నారు కనుక వారు పంటలు వేసుకునేందుకు బ్యాంక్ రుణాలు పొందేందుకు భూమి యజమాని అంటే రైతు సంతకం అవసరం లేకుండా కౌలు కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
అయితే ఈ రుణాల లావాదేవీల వలన భూయజమాని అయిన రైతుల యాజమాన్య హక్కులకు, వారి భూమికి ఎటువంటి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం మండల స్థాయిలో రైతులు, కౌలు రైతులను సమావేశపరిచి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ విధానం గురించి వివరించి వారి అనుమానాలు, అపోహలు తొలగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రైతుల ఆమోదంతోనే వచ్చే రబీ సీజన్ నాటికి రాష్ట్రంలో కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. కౌలు రైతులను ఆదుకోవాలనే మనసుంటే ఆదుకోవచ్చని సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడుకి తేడా ఇదే!