టీటీడీ శ్రీవారి లడ్డు ప్రసాదం సుడిగుండంలో చిక్కుకుని వైసీపీ బతుకు పోరాటం చేస్తున్న వేళ వైసీపీ నుండి టీడీపీ లోకి చేరిన డొక్కా మాణిక్యరావు వైసీపీ పై మరిన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోణలు చెయ్యరు కదా.
కిరాయి కోసం వైసీపీ కాంప్లెక్స్ లో ఏంజరుగుతాయో నాకు తెలుసు కాబట్టి నేను ఈ ఆరోపణలను కచ్చితంగా నమ్ముతాను. సుమారు నాలుగేళ్ళ పాటు స్వయంగా నేను కూడా ఆ కాంప్లెక్స్ లో వైసీపీ చేసిన దుర్మార్గాలను చూసాను. అవి భరించలేకే ఆ పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చింది.
వైసీపీ కాంప్లెక్స్ కమెండేర్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని ఈ కిరాయి గుండాలు అమలు చేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఢిల్లీలో ఉన్న జిత్వాని కుటుంబాన్ని కాంప్లెక్స్ కమాండర్ ఆదేశాలు మేరకే విజయవాడ రప్పించి వారి పై తప్పుడు కేసులు పెట్టి వేధించారు.
డబ్బు కోసం కిరాయి గుండాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తారు వైసీపీ మూకలు అంటూ వైసీపీ పార్టీ తీరును ఎండగట్టారు డొక్కా. ఒక ఆడకూతురిని వేధించడానికి ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులను సైతం కిరాయి గుండాలుగా మార్చిన చరిత్ర పార్టీ వైసీపీది. అటువంటి పార్టీకి తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అనేది పెద్ద నేరమేమి కాకపోవచ్చు.
అసలు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏ ఒక్కరి పైన విచారణ జరిపిన ఆనవాళ్లు కానీ శిక్ష వేసిన దాఖలాలు కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసిన వెంటనే శిక్ష వేసేయాలి అనడం వైసీపీ మూర్కత్వన్ని తెలియచేస్తుందన్నారు.
సంప్రదాయాలకు, విలువలకు వైసీపీ లో చోటే లేదు. అందుకు నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షినే అంటూ డొక్కా తన ఆవేదనను వ్యక్త పరిచారు. మీడియా సాక్షిగా వైసీపీ కాంప్లెక్స్ కమాండర్ సజ్జల, వైసీపీ కిరాయి గుండా సీతారాంజనేయులు వస్తే వారు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో, నాకు ఎలాంటి దుర్మార్గపు సూచనలు చేసారో తిరుమలలో కానీ వెంకటపాలెం లో కానీ ప్రమాణం చేసి మరిన్ని వైసీపీ దారుణాలు బయటపెట్టనికి నేను సిద్ధం మరి వారు సిద్ధమా అంటూ సజ్జలకు, ఆంజనేయులు సవాల్ విసిరారు డొక్కా.
అయితే ఇన్నాళ్ళుగా వైసీపీ పార్టీని ఒక అవినీతి పార్టీ, పెత్తందారుల పార్టీ, నీచరాజకీయ సంస్కృతులను ఏపీ రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా అటు టీడీపీ, ఇటు జనసేన విమర్శలు గుప్పించారు కానీ డొక్కా మాత్రం వైసీపీ కి మరో కొత్త పేరును ప్రతిపాదించారు. కల్కి సినిమాలోని కాంప్లెక్స్ కథ ఇక్కడ ఏపీలో కూడా జరుగుతుంది అంటూ వైసీపీని కాంప్లెక్స్ రాజకీయాలు చేసే కిరాయి పార్టీగా అభివర్ణించారు.




