
పర్యాటక రంగంలాగే మెడికల్ టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం వంటివి చాలా ఉన్నాయి. కనుక అనేక దేశాలు, రాష్ట్రాలు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి.
ఇటువంటిదే అమెరికాలో ఉన్నత విద్యారంగం. అమెరికాలో ఉన్నతవిద్యలు అభ్యసించాలనే ప్రపంచదేశాల మోజు అమెరికాకు భారీగా ఆదాయం సమకూర్చిపెడుతోంది. అమెరికా యూనివర్సిటీలు విదేశీ విద్యార్ధులతో కిటకిటలాడుతుంటాయి.
Also Read – ఏ.ఆర్. రెహమాన్‌కు 2 కోట్ల జరిమానా!
అమెరికాకు భారీ ఆదాయం సమకూర్చుతున్న యూనివర్సిటీలని మరింత ప్రోత్సహించవలసిన డోనాల్డ్ ట్రంప్, వాటిపై ఆంక్షలు విధిస్తున్నారు!
యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్ధులు క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదనే ఆంక్షలను ట్రంప్ ప్రభుత్వం నిఖచ్చిగా అమలు చేస్తుండటంతో విదేశీ విద్యార్ధులు ఆ చిన్న ఆదాయం కోల్పోతున్నారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
ఆ కారణంగా వారి ఫీజులు, ఇతర ఖర్చులకు తల్లి తండ్రులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
అయితే విదేశీ విద్యార్ధులకు స్థానిక పెట్రోల్ బంకులు, దుకాణాలలో ఇచ్చే జీతానికి అమెరికన్ యువత పనిచేస్తుందా?వారికి సరిపడా జీతం అవి ఇవ్వగలవా?లేకుంటే?కనుక ఈ ఆంక్షలతో ట్రంప్ ఏం సాధించారో ఆయనకే తెలియాలి.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
తాజాగా విదేశీ విద్యార్ధులపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వివిద సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న విద్యార్ధులకు, అమెరికా రాజకీయాలు, ట్రంప్ ప్రభుత్వం, ఆయన ఆలోచనలు, విధానాల గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న విదేశీ విద్యార్ధులని ట్రంప్ ప్రభుత్వం తిప్పి పంపిస్తోంది.
మీ వీసాలు రద్దు చేశామని కనుక తక్షణం దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ ఈమెయిల్స్ పంపిస్తుండటం చూసి విదేశీ విద్యార్ధులు షాక్ అవుతున్నారు.
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడం అంటేనే చాలా ఖరీదైన వ్యవహారం. సీటు సాధించేందుకు విద్యార్ధులు పడే శ్రమ, వారి చదువులకు అవసరమైన డబ్బు సమకూర్చడానికి తల్లితండ్రులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
కనుక ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికా యూనివర్సిటీలలో చదువుకుంటుంటే, హటాత్తుగా వారిపై అమెరికా వ్యతిరేకులు ముద్ర వేసి వీసా రద్దు చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మంటే వారి పరిస్థితి, వారి భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారుతుంది.
యూనివర్సిటీల కోణం నుంచి చూసిన్నట్లయితే, ఇటువంటి నిర్ణయాల వలన వాటి ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఉద్యోగాలకు భద్రత లేకపోవడం సహజమే కావచ్చు కానీ చదువులకు కూడా భద్రత లేకపోతే?యూనివర్సిటీల భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంటుంది.
అయినా భావ ప్రకటన స్వేచ్చని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్, ముందుగా భావ ప్రకటన స్వేచ్చని హరించివేస్తుండటం చాలా శోచనీయం.
వాణిజ్య పన్నుల విధానంలో కూడా ట్రంప్ ధోరణితో ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు అమెరికన్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కానీ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించే డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అత్యంత శక్తివంతుడు. కనుక ఆయన మాటే శాసనం అన్నట్లు సాగిపోతోంది. ఆయన ఎప్పుడు ఏం బాంబు పేలుస్తారో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.